సోషల్ మీడియా లవ్ బర్డ్స్ దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ బ్రేకప్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. బ్రేకప్ చెప్పుకున్న వీరిద్దరూ బానే ఉన్నారు… కానీ వీరి బ్రేకప్ కు అసలు కారణం సిరి హన్మంత్ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. బిగ్ బాస్ లో సిరితో షణ్ముక్ ఎక్కువ క్లోజ్ ఉండటం వల్లే దీప్తి సునైనా హర్ట్ అయిందని అందువల్లే షన్నుకు బ్రేకప్ చెప్పిందని సిరి పై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.
అయితే తాజాగా వాళ్ల బ్రేకప్ పై సిరి స్పందించింది. సిరి మీడియాతో మాట్లాడుతూ… షణ్ముక్ దీప్తి మధ్య ప్రేమ వ్యవహారం లో తన పై ట్రోలింగ్ రావడంతో తాను డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పింది. వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ తర్వాత మళ్ళీ తన పైన ట్రోలింగ్ వచ్చిందని వెల్లడించింది. బిగ్ బాస్ హౌస్ లో 100 రోజుల్లో మా మధ్య చాలా ఎమోషన్స్ ఉన్నాయని తెలిపింది.
Advertisement
Advertisement
అయితే తనకు షణ్ముక్ కు మధ్య అది కాస్త ఎక్కువైందని… అది కేవలం స్నేహం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. దీప్తి షణ్ముక్ తనకు మంచి స్నేహితులు అని వారు నా వల్లే విడిపోయారు అని చెప్పడం సరి కాదని తెలిపింది. కేవలం వంద రోజుల్లో విడిపోయేటంత వీక్ ప్రేమ అని తాను అనుకోవడం లేదని చెప్పింది. తన వల్ల దీప్తి షణ్ముక్ లో విడిపోయారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది.
వాటిని సోషల్ మీడియాలో పుట్టించిన పుకార్లు గానే తాను చూస్తానని తెలిపింది. అదే విధంగా బిగ్ బాస్ హౌస్ లో షణ్ముక్ మరియు జెస్సీలు తనకు మంచి స్నేహితులు అని రవి తో బ్రదర్ ఫీలింగ్ ఉండేదని చెప్పింది. ఇది ఇలా ఉంటే బ్రేకప్ చెప్పింది దీప్తి సునైనా మాత్రమేనని షణ్ముక్ ఇంకా బ్రేకప్ చెప్పలేదని వాళ్ళిద్దరు మళ్లీ కలుస్తారని రీసెంట్ గా షణ్ముక్ తండ్రి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also read : సంక్రాంతి సినిమాల ప్రీరిలీజ్ బిజినెస్ ఇదే.. అల్లుళ్లు ఎవరంటే…?