చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే చాలామంది ప్రముఖ దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలామంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది మరణిస్తే మరి కొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. లెజెండరీ సింగర్ వాణి జయరామ్ ఇకలేరు. ఈరోజు ఆమె తుదిశ్వాస విడిచారు.
Advertisement
చెన్నైలోని తన స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. అయితే, ముఖంపై తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయినస్థితిలో వాణీజయరాం.. కాలింగ్ బెల్ కొట్టినా తలుపులు తీయకపోవడంతో మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్ళమన్న పనిమనిషి.. ఆమె ముఖంపై బలమైన గాయాలు చూశానని తెలిపాడు. కానీ, ఆస్పత్రికి తీసుకొచ్చే సమయానికే ప్రాణాలు కోల్పోయినట్టు చెబుతున్నారు డాక్టర్లు.
Advertisement
ఇది ఇలా ఉండగా,1945 నవంబర్ 30న దురైస్వామి, పద్మావతి దంపతులకు వాణి జయరామ్ జన్మించారు. తమిళనాడులోని వెల్లూరు ఈమె స్వస్థలం. హిందుస్థానీ క్లాసికల్ సింగింగ్ లో ప్రావీణ్యం పొందిన వాణి జయరామ్ తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, గుజరాతి, మరాఠీ, ఒరియా, భోజ్ పురి ఇలా 14 భాషల్లో దాదాపు పదివేలకు పైగా పాటలు ఆలపించారు.
కే.వి.మహదేవన్, ఎం.ఎస్.విశ్వనాథన్, ఇళయరాజా, పెండాల్య, చక్రవర్తి, సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో ఎక్కువ పాటలు పాడారు. సంగీత రంగానికి ఆమె చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్ అవార్డును ప్రకటించగా, అది అందుకోకుండానే ఆమె కన్నుమూయడం బాధాకరం. మూడు జాతీయ పురస్కారాలను కూడా ఆమె అందుకున్నారు. వాణి జయరామ్ మరణంతో సంగీతలోకం కన్నీరు మున్నీరవుతుంది.
Read Also : మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!