Home » Singer Revanth: అంగరంగ వైభవంగా సింగర్ రేవంత్ పెళ్లి..ఫోటోలు వైరల్..!

Singer Revanth: అంగరంగ వైభవంగా సింగర్ రేవంత్ పెళ్లి..ఫోటోలు వైరల్..!

by AJAY
Ad

ప్రముఖ టాలీవుడ్ సింగర్ రేవంత్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. గుంటూరుకు చెందిన అన్వితను ఫిబ్రవరి 6న రేవంత్ వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుక గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో కుటుంబ సభ్యులు బంధు మిత్రుల మధ్య ఈ వివాహ వేడుక జరిగినట్టు తెలుస్తోంది.

Singer Revanth Marriage photos

Singer revanth marriage

Singer revanth marriage

అంతేకాకుండా టాలీవుడ్ కు చెందిన పలువురు గాయనీగాయకులు ఈ పెళ్ళికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. రేవంత్ అన్వితల ఎంగేజ్మెంట్ డిసెంబర్ 24న జరగ్గా ఫిబ్రవరి 6న వివాహం జరిగింది. ఇదిలా ఉండగా రేవంత్ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడారు.

Advertisement

Advertisement

Singer revanth marriage

బాహుబలి సినిమాలో “మనోహరి” అనే పాట ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదేవిధంగా ఇండియన్ ఐడల్ 9 విజేతగా నిలిచి బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకున్నాడు.

తన గాత్రంతో ఇండియన్ ఐడల్ జడ్జీలను సైతం రేవంత్ ఆశ్చర్యపరిచారు. ఇక ప్రస్తుతం రేవంత్ అన్విత పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఆయన అభిమానులు నూతన దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

AlsoRead: SARAYU : బిగ్ బాస్ బ్యూటీపై కేసున‌మోదు…ఆ వీడియోనే కార‌ణం..!

Visitors Are Also Reading