సెలబ్రెటీలు బయట కనిపించారంటే చాలు అభిమానులు వారిపై ఎగబడిపోతుంటారు. తమ అభిమానం సెలబ్రెటీలకు ఇబ్బంది కలిగిస్తుందని కూడా మర్చిపోతుంటారు. ఇక బడా సెలబ్రెటీలు అంటే పది ఇరవైమంది బౌన్సర్ లను పెట్టుకుంటారు కానీ చోటా సెలబ్రెటీలకు అంత సంపాదన ఉండదు కాబట్టి ఒకరిద్దరు బౌన్సర్ లతో సరిపెట్టుకుంటారు. దాంతో అలాంటి వాళ్లు ఎక్కడికైనా వెళ్లినప్పుడు అభిమానులు చుక్కలు చూపిస్తూ ఉంటారు. తాజాగా సింగర్ మంగ్లీకి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది.
Advertisement
మంగ్లీ రీసెంట్ గా పుష్ప సినిమా కన్నడ వర్షన్ కు ఊ అంటావా ఊఊ అంటావా పాటను పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట ఎంతో పాపులర్ అయ్యింది. మంగ్లీ సోదరి ఇంద్రావతి తెలుగు వర్షన్ పాడగా ఆమె కూడా ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా మంగ్లీ ఒంగోలులోని ఓ కార్యక్రమానికి హాజరైంది. అయితే ఈ కార్యక్రమంలో మంగ్లీపై కి అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కార్యక్రమం అనంతరం బయటకు వచ్చిన మంగ్లీపై అభిమానులు సెల్ఫీల కోసం వెంటపడ్డారు.
Advertisement
దాంతో ఇబ్బంది పడిన మంగ్లీ ఇదేం పద్దతి అంటూ అసహనం వ్యక్తం చేసింది. తన అసిస్టెంట్ ను చేతితో కొడుతూ బండి తియ్ దరిద్రుడా..ఫోన్ చెయ్ అంటూ మండి పడింది. ఇక ప్రస్తుతం మంగ్లీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు. సెలబ్రెటీలను చేసేది మనమే కాబట్టి దెబ్బలు కూడా మనమే తినాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి కొందరు మాత్రం మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నారు. మనం మంగ్లీ స్థానంలో ఉన్నా కూడా అలాగే చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు.