అన్న గారు ఎన్టీ రామారావు చాలా మొండివారని ఆయన సన్నిహితులు, ఆయనతో కలిసి సినిమాలు చేసిన వారు ఇంటర్వ్యూ లలో చెబుతుంటారు. ఎన్టీరామారావు ఏదైనా పని చేయాలని అనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు నిద్ర పోయే వారు కాదట. ఇక తాతగారి రూపురేఖలతో జన్మించిన జూనియర్ ఎన్టీఆర్ కు తాతగారి ఆ మొండితనం కూడా వచ్చిందని అంటూ ఉంటారు.
Advertisement
ఈ విషయాన్ని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా తన పరుచూరి పలుకులు కార్యక్రమంలో బయటపెట్టారు. ఎన్టీఆర్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆది సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంలో జరిగిన ఓ సన్నివేశాన్ని గుర్తు చేశారు. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ ను షూట్ చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ చేతికి ఒక క్లాసు తగిలి గాయం అయ్యిందట.
Advertisement
దాంతో పరుచూరి గోపాలకృష్ణ గారు వివి వినాయక్ ను షూటింగ్ అపేసారా అని ప్రశ్నించగా…. లేదు సార్ తారక్ షూటింగ్ కంటిన్యూ చేద్దాం అని చెప్పారు అని అన్నారట. ఆ సమయంలో పరుచూరి కి సీనియర్ ఎన్టీఆర్ మొండితనం గుర్తుకు వచ్చిందట. సర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్.టి.రామారావు చేతికి కూడా గాయం తగిలి రక్తం కారిందట… అయినప్పటికీ అన్నగారు ఈ మాత్రం దానికే షూటింగ్ ఆపడం ఏంటి అంటూ షూటింగ్ కంటిన్యూ చేశారట. ఇక సర్దార్ పాపారాయుడు సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ఆది కూడా అంతే బ్లాక్ బస్టర్ గా నిలిచిందని పరుచూరి అన్నారు.
ఆది సినిమా 2002 లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా 98 కేంద్రాలలో 100 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. దాంతో ఇతర ఇండస్ట్రీలలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు.