తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటులలో స్వర్గీయ ఎన్టీ రామారావు ముందు వరసలో ఉంటారు. పౌరాణిక, రాజకీయ, జానపద చిత్రాల్లో నటించి ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరించారు. సినిమాల్లో స్టార్ హీరోగా రాణించిన ఎన్టీఆర్ ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అతి తక్కువ కాలంలో సీఎం కుర్చిపై కూర్చున్నారు. అద్బుతమైన పతకాలతో పేదప్రజల కడుపునింపాడు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నట వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణలు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
బాలకృష్ణ స్టార్ హీరోగా రాణించగా హరికృష్ణ తక్కువ సినిమాలే చేసినప్పటికీ సూపర్ హిట్స్ అందుకుని అభిమానులను సంపాదించుకున్నారు. హరికృష్ణ నటించిన సీతయ్య, టైగర్ హరిచంద్రప్రసాద్ సినిమాలు ప్రేక్షకులను ఎంగానో ఆకట్టుకున్నాయి. ఇక ఎన్టీర్ కు హరికృష్ణ అంటే చాలా ఇష్టం. ఏం అడిగినా కాదనేవాడు కాదు. కానీ రెండేళ్ల పాటు ఎన్టీఆర్ తో హరికృష్ణ అస్సలు మాట్లాడటలేదట.
Advertisement
ఎన్టీఆర్ ఏది చేయాలనుకుంటే అది చేసే స్వభావం గల వ్యక్తి. ఒకసారి తాను నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. అయితే హరికృష్ణ సినిమాలలోకి వచ్చిన కొత్తలో సినిమా హాలును నిర్మించుకుంటానని ఎన్టీఆర్ తో చెప్పారట. తన కోసం సినిమా హాలును నిర్మించాలని కోరారట. దాంతో ఎన్టీఆర్ తన మిత్రుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు సలహా కోసం వెళ్లగా అక్కినేని స్టూడియో నిర్మిస్తే బెటర్… వ్యాపారం కూడా
జరుగుతుంది. సినిమా హాల్ తో పెద్దగా లాభం ఉండదని సలహా ఇచ్చారట. దాంతో ఎన్టీఆర్ సినిమా హాలు నిర్మించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని హరికృష్ణకు చెప్పారు. దాంతో తనకోసం సినిమా హాలు నిర్మించలేదని తండ్రి ఎన్టీఆర్ తో హరికృష్ణ రెండేళ్ల పాటు మాట్లాడలేదట. అయితే ఆ తరవాత కోపం తగ్గి మళ్లీ తండ్రితో మాట్లాడారట.