Home » ఆ టైం లో చాలా ఏడ్చాను.. హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్..!

ఆ టైం లో చాలా ఏడ్చాను.. హీరో సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్..!

by Sravya
Ad

హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యకించి చెప్పక్కర్లేదు సిద్ధార్థ్ మనందరికీ పరిచయమే. తెలుగులో పలు సినిమాల్లో నటించి అందర్నీ ఆకట్టుకున్నారు. బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలు ఎప్పటికీ మర్చిపోలేము. తెలుగులో చివరగా మహాసముద్రం సినిమాలో కనపడ్డారు. సిద్ధార్థ్ కాకుండా శర్వానంద్ కూడా ఈ సినిమాలో మరో హీరో కింద నటించారు. సినిమాలలో నటిస్తూ బిజీ గా గడుపుతూ ఉంటాడు సిద్ధార్థ్. తాజాగా చిత్తా సినిమాలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

Advertisement

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. అక్టోబర్ 6న చిన్న అనే పేరుతో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సిద్ధార్థ పలు ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఒక స్టార్ హీరో సినిమా చూసి తను బాగా ఏడ్చానని చెప్పారు సిద్ధార్థ్ అలానే కమలహాసన్ గారికి నేను వీరాభిమానిని. పైగా ఆయనని ఈ మధ్య కలిశాను అని కూడా చెప్పారు. ఎన్నో విషయాలు గురించి మేము మాట్లాడుకున్నామని కూడా చెప్పారు. విచిత్ర సోదరులు సినిమా విషయాలు కూడా మాట్లాడుకున్నారట. ఆ సినిమా చూసిన క్షణాలు నాకు గుర్తొస్తున్నాయి అని.. తొమ్మిదేళ్ల వయసులో మా అమ్మతో పాటు ఆ సినిమా చూశానని సిద్ధార్థ్ చెప్పారు.

Also read:

Visitors Are Also Reading