క్రిస్మస్ కానుకగా రిలీజైన నాని శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మంచి కథతో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సినిమా 8 రోజుల్లో మంచి కలెక్షన్లను సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా శ్యామ్ సింగరాయ్ 22 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో రిలీజైన ఈ మూవీ డీసెంట్ వసూళ్లు సాధిస్తూ బ్రేక్ ఈవెన్ దిశగా అడుగులు వేసింది. మొదటి 8 రోజుల్లో ఈ మూవీ 37.35 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇందులో 21.12 కోట్లు షేర్ ఉంది. సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ. 22 కోట్లు ఉండటంతో మరో 1 కోటి రూపాయల షేర్ సాధిస్తే సినిమా హిట్ అయిందని చెప్పుకోవచ్చు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాని డబుల్ రోల్ చేశారు. ఇందులో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌తో 1960 కాలం నాటి కథతో తెరకెక్కింది. అప్పట్లో సమాజంలో ఉన్న అసమానతలను ఎత్తిచూపుతూ, వాటిపై పోరాటం చేసే వ్యక్తిగా, రచయితగా శ్యామ్ సింగరాయ్ పాత్ర ఉంటుంది. ఆధునిక కాలంలో దర్శకుడిగా మారాలని అనుకున్న నానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కథను రాసే సమయంలో జరిగిన సంఘటనల ఆధారంతో సినిమాను ఆసక్తిగా మలిచారు. రెండు షేడ్స్‌లో నాని అద్భుతంగా నటించి మెప్పించారు.
Advertisement