Ad
శృతిహాసన్.. తెలుగులో ఉన్న టాప్ హీరోయిన్స్ లలో ఒక్కరు. హీరో సిద్ధర్థ్ తో కలిసి అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా విజయం అందుకోలేదు. ఆ తర్వాత కూడా తెలుగులో నటించిన కొన్ని సినిమాలు ప్లాప్ కావడంతో.. శృతిహాసన్ పైన నెగెటివ్ మార్క్ అనేది ఏర్పడింది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శృతిహాసన్… కు తెలుగులో మళ్ళీ అవకాశాలు అనేవి రావడం ప్రారంభమయ్యాయి. అయితే శృతి కేవలం యాక్టర్ మాత్రమే కాకుండా సింగర్ కూడా.
ఇక తెలుగుతో పాటుగా.. తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించి సూపర్ హిట్స్ అందుకున్న శృతిహాసన్ పైన చాలా రూమర్స్ వస్తుంటాయి. కానీ అవి పటించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే సినిమాల్లోనే కాకుండా… సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే శృతిహాసన్.. తన అభిమానుల కోసం ఎప్పుడు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. అలాగే వారి ప్రశ్నలకు కుశ అప్పుడప్పుడు సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇలాగె.. తాజాగా తన చేతి మీద ఉండే టాటూ గురించి.. దాని వెనుక ఉన్న అర్ధం గురించి శృతి వివరించింది.
ఓ అభిమాని శృతిహాసన్ చేతి మీద ఉంటె టాటూ గురించి ప్రశ్నించగా… ఇది గులాబీ.. కానీ చాలా మంది క్యాబేజి అనుకుంటారు అని చెప్పింది. దానికి ప్రేమ అనేది కావాలి. అందుకే అందరికి అలా కనిపిస్తుంది అని కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతం శృతిహాసన్ శాంతాను హాజారికా అనే వ్యక్తితో డేటింగ్ లో ఉన్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె.. తెలుగులో ఈ మధ్యే క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న శృతిహాసన్.. ప్రస్తుతం బాలకృష్ణ సరసన నటిస్తుంది.
Advertisement