బైలేచరల్ టైస్ ను తిరిగి ప్రారంభించడానికి ముందు నెల రోజులుగా టీం ఇండియా మెంబెర్స్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలి ఈవెంట్లలో, వెన్ను గాయం నుండి కోలుకుంటున్న స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఓ స్టేటస్ ను పంచుకున్నారు. అయ్యర్ తన బాల్కనీ నుండి ముంబై వర్షాల స్టోరీని పంచుకున్నారు.
Advertisement
ఈ స్టేటస్ ఇప్పుడు నెటిజన్స్ లో కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్ తో పాటు ధనశ్రీ కూడా తన బాల్కనీ నుంచి తీసినట్లుగా అదే స్టోరీని పోస్ట్ చేసారు. దీనితో నెటిజన్స్ కొంత అయోమయానికి గురి అయ్యారు. ఇప్పటికే వీరిద్దరూ కలిసి పలు రీల్స్, పార్టీలలో కలిసి కనిపించారు. రీసెంట్ గా వీరిద్దరూ ఒకేలాంటి స్టేటస్ లు పెట్టడంతో ఈ అనుమానాలకు రెక్కలు వచ్చినట్లైంది.
Advertisement
ఇప్పటికే సోషల్ మీడియా లో మీమ్స్ పేజీలు హంగామా చేస్తున్నాయి. అయ్యర్ స్టోరీ ఏంటి ఏదో తేడాగా ఉంది? అంటూ పోస్ట్ లను షేర్ చేస్తున్నాయి. మొదటగా ఓ ట్విట్టర్ యూజర్ ఈ రెండు స్టేటస్ లు ఒకేలాగా ఉండడాన్ని పాయింట్ అవుట్ చేసారు. దీనితో సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ అయింది. అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకోకుండానే, కొందరు ధనశ్రీని ట్రోల్ చేయడం, చాహల్ కు మద్దతు పలకడం స్టార్ట్ చేసేసారు.ధనశ్రీ అయ్యర్ సహచరుడు యజువేంద్ర చాహల్ భార్య అన్న సంగతి విదితమే.
మరిన్ని ముఖ్య వార్తలు:
మెడిసిన్ స్ట్రిప్స్‌పై ఈ విధమైన సంకేతాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?
భార్య చేసే ఈ పాడు పనుల వల్ల.. ఇంట్లో డబ్బును కోల్పోతాము…!