మనిషి జీవితంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మన జీవితంలో జరిగే అన్ని సమస్యలకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అయితే మనం ఎదుర్కొనే సమస్యలకు మనమే ముఖ్య కారణం అని చెప్పాలి. మనం తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మనకు సమస్యలు చుట్టూ ముడుతుంటాయి. ముఖ్యంగా మనం శని దేవుడికి కోపం తెప్పించే పనులు చేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు ఉండాలంటే శని దేవుడికి కోపం తెప్పించకూడదు.
Advertisement
శని దేవున్ని ప్రసన్నం చేసుకోవాలి. అలా చేస్తే అన్ని పనులు చక్కగా జరుగుతాయని చెబుతున్నారు. శని దేవున్ని ప్రసన్నం చేసుకోవడానికి దానం చేయడం ఉత్తమం అని భావిస్తారు. అది కూడా శనివారం రోజున దానం చేస్తే ఈయనకు మంచి జరిగేలా చేస్తాడని భావిస్తారు. కానీ పొరపాటున కూడా శనివారం రోజున మీరు ఈ వస్తువులను దానం చేస్తే కష్టాల పాలు అవ్వాల్సిందే. మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం…శనివారం రోజున పొరపాటున కూడా పసుపును దానం చేయకూడదు. పసుపు వస్తువులు బృహస్పతి గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. శని, బృహస్పతి ఒకరికొకరు శత్రువులని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే శనివారం రోజున పసుపు, బంగారం, ఇత్తడి, పసుపు బట్టలు దానం చేయడం చేస్తే శని దేవుడికి కోపం వస్తుందట.
Advertisement
అలాగే తెల్లటి వస్తువులను కూడా దానం చేయకూడదు. తెల్లని వస్తువులను బృహస్పతి పూజలో సమర్పించకూడదు. అలాగే దానం కూడా చేయకూడదట. తెల్లని వస్తువులు చంద్రుడితో సంబంధం కలిగి ఉంటాయి. పంచదార, వెండి, బియ్యం వంటి వస్తువులను దానం చేయకూడదు. ఎరుపు రంగు వస్తువులు సూర్యుడితో సంబంధం కలిగి ఉంటాయట. సూర్యుడు, శని ఒకదానికొకటి ప్రతికూలంకంగా ఉంటాయి. కాబట్టి ఎరుపు రంగు వస్తువులను దానం చేయకూడదు. అసలు శనివారం ఎరుపు రంగు వస్తువులను ఉపయోగించకూడదు. శని దేవుడు నలుపు రంగును ఇష్టపడతాడు. అతనికి నల్లని వస్తువులను మాత్రమే సమర్పించాలి. ఈయనకు పప్పు, నల్ల నువ్వులు, నల్లని వస్తువులు దానం చేస్తే శని దేవుడు చాలా సంతోషిస్తాడు.