ఐసీసీ నిర్వహిస్తున్న మెగా టోర్నీ వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరగబోతుంది. అక్టోబర్ ఐదున ఈ టోర్ని స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ప్లేయర్స్ ను సిద్ధం చేస్తున్నాయి. ఇక టీమిండియా కూడా ప్లేయర్స్ ను ఫిట్నెస్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక వన్డే వరల్డ్ కప్ లో ఆడే ప్లేయర్స్ లిస్ట్ లో ఒక స్టార్ ప్లేయర్ దూరం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దానికోసం చికిత్స తీసుకుంటున్నాడు. వన్డే వరల్డ్ కప్ నాటికి ఫిట్నెస్ సాధించి జట్టులో చేరతాడని అందరూ భావించారు.
Advertisement
కానీ అధికారుల నుండి వస్తున్న సమాచారం ప్రకారం శ్రేయస్ మెగా లీగ్ కు దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది. వెన్నునొప్పి కారణంగా ఐపీఎల్ కు దూరమైన శ్రేయస్ వేగంగా కోలుకోవడం లేదు. ఆసియా కప్ నాటికే శ్రేయస్ ఫిట్నెస్ సాధిస్తాడని అందరూ భావించారు. కానీ అది సాధ్యపడేలా లేదు. శ్రేయస్ ప్రస్తుత పరిస్థితి గురించి బీసీసీఐ సీనియర్ అధికారి మాట్లాడుతూ… వరల్డ్ కప్ కు అతను సిద్ధమవుతాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం అని తెలిపాడు. ఇక మిడిలార్డర్ లో భారీగా పరుగులు చేసే శ్రేయస్ లాంటి ప్లేయర్ వన్డే వరల్డ్ కప్ లో దూరం అవడం భారత్ కు గట్టి దెబ్బ.
Advertisement
ఇక ఇప్పటివరకు రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ గెలిచింది. టీమిండియా 2011లో ధోని కెప్టెన్సీలో చాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గత పది ఏళ్లుగా ఐసీసీ మెగా టోర్నీలో కప్పు కొట్టలేదు. భారత్ ఇటీవల జరిగిన ఐసీసీ మెగా టోర్నీ డబ్ల్యూటీసీ ఫైనల్ లో కూడా ఓడిపోయింది. అందుకే వన్డే వరల్డ్ కప్ మీద ఆశలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇండియాలో ఈ మెగా లీగ్ జరగడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. మరి స్టార్ ప్లేయర్ దూరమవుతున్న నేపథ్యంలో టీమిండియా వరల్డ్ కప్ లో ఏ విధంగా రాణిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.
ఇవి కూడా చదవండి
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..
బట్లర్‌కు రాజస్తాన్ రాయల్స్ బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.40 కోట్లు!
టీమిండియా కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ ?