Home » చైతూను పెళ్లి చేసుకోవాలంటే శోభిత‌కు 2 కిండిష‌న్స్ పెట్టిన నాగార్జున‌..అవి ఏంటంటే..?

చైతూను పెళ్లి చేసుకోవాలంటే శోభిత‌కు 2 కిండిష‌న్స్ పెట్టిన నాగార్జున‌..అవి ఏంటంటే..?

by AJAY
Ad

సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న నాటి నుండి తరచూ అక్కినేని ఫ్యామిలీ గురించి ఏదో ఒక వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. కొన్నేళ్లపాటూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న చైతూ సమంత ఆ తర్వాత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య లవర్ బాయ్ అంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఆ కారణంగానే సమంత చైతూ కి విడాకులు ఇచ్చింది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాగచైతన్య ప్రస్తుతం హీరోయిన్ శోభిత ధూళిపాళ‌ తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి కారణం ఇద్దరూ కలిసి తిరుగుతూ మీడియా కంటపడటమే. రీసెంట్ గా నాగచైతన్య సోష‌ల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేయగా అందులో వెనకాల శోభిత దూళిపాళ‌ కనిపిస్తుంది.

Advertisement

దాంతో వీరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు మరో వార్త కూడా హాట్ టాపిక్ గా మారింది. నాగచైతన్య శోభితను వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట. అంతేకాకుండా ఈ విషయాన్ని తండ్రి నాగార్జున తో షేర్ చేసుకున్నారట. అయితే చైతూ చెప్పిన మాట విన్న నాగార్జున హీరోయిన్ శోభిత దూళిపాళ‌కు రెండు కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది.

చేతూతో పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టారట. ఇక నాగార్జున కండిషన్ కు శోభిత దూళిపాళ‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నాగచైతన్య కోసం సినిమాలను కూడా వదులుకోవడానికి ఈ హీరోయిన్ సిద్ధమైనట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మ‌రో కండిష‌న్ విష‌యానికి వ‌స్తే ఇప్ప‌టికే చైతూకు స‌మంతో విడాకులు అయ్యాయ‌ని కాబ‌ట్టి క‌చ్చితంగా క‌లిసి ఉంటాము అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే పెళ్లి చేసుకోవాల‌ని తేల్చిచెప్పార‌ట‌.ఇక‌ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రమే పడుతుంది.

also read :దర్శకుడు సుకుమార్ పై IT దాడులు.. ఆ MLAలు కారణమని మీకు తెలుసా..?

Visitors Are Also Reading