Home » అవ‌కాశాలు లేక ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్లాల‌నుకున్నాడు., భార్య స‌ల‌హాతో నిల‌బ‌డి ఇండ‌స్ట్రీని షేక్ చేశాడు!

అవ‌కాశాలు లేక ఇండ‌స్ట్రీ వ‌దిలి వెళ్లాల‌నుకున్నాడు., భార్య స‌ల‌హాతో నిల‌బ‌డి ఇండ‌స్ట్రీని షేక్ చేశాడు!

by Azhar
Ad

ముగ్గురు డిగ్రీ స్టూడెంట్స్ క‌లిసి “పునర్జన్మ”అనే నాటకాన్ని వేశారు. ఆ నాట‌కం హిట్ అవ్వ‌డంతో ముగ్గురికీ మంచి పేరు వ‌చ్చింది. దీంతో సినిమాల్లో న‌టించాల‌నుకున్నారు ఆ ముగ్గ‌రు. వారే 1) శోభ‌న్ బాబు 2) కృష్ణ 3) ముర‌ళీ మోహ‌న్. వీరి ముగ్గురిలో శోభ‌న్ బాబు ప‌రిస్థితి వేరు, ఆయ‌న ఎదిగిన క్ర‌మం వేరు.

Advertisement

  • కృష్ణాజిల్లాలోని చిన్ననందిగామలో 1937 జనవరి 14 ఒక సాధారణ రైతుకుటుంబంలో జన్మించిన శోభ‌న్ బాబు, లా చ‌ద‌వ‌డం కోసం చెన్నై వెళ్లారు. లా కంటే కూడా సినిమాల్లో అవ‌కాశం కోసం చెన్నై వెళ్లారు అన‌డం స‌బ‌బు.
  • 1957లోనే వివాహం అవ్వ‌డంతో భార్యను కూడా త‌న వెంట‌ మద్రాసుకు తీసుకెళ్లాడు. వేషాలకోసం సైకిల్ పై స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ చివ‌ర‌కు 1959లో యన్ టి ఆర్ ప్రక్కన దైవబలం అనే సినిమాలో చిన్న అవ‌కాశం దొరికిచ్చుకున్నాడు.ఆ సినిమా ప్లాఫ్ అవ్వ‌డంతో ఆ త‌ర్వాత‌ వేషాల్లేకుండా పోయాయి.
  • భార్య‌, పిల్ల‌లు, అవ‌కాశాలు లేవు, చేయి చాచి డ‌బ్బు అడ‌గ‌డం నామోషీగా ఫీల్ అయ్యి… ఊరికి వెళ్ళిపోదామని భార్యతో చెప్పాడు. భార్య ఓదార్చింది. ఓపిక ప‌ట్టండి మీరు మంచి నటులవుతారని ధైర్యం చెప్పింది.
  • 1959 నుండి 1969 వరకు చిన్నాచిత‌క పాత్ర‌ల్లో న‌టించినా స‌రైన గుర్తింపు రాలేదు. కానీ కుటుంబ పోష‌ణకు అలా వ‌చ్చిన డ‌బ్బు స‌రిపోతుండ‌డంతో వ‌చ్చిన ప్ర‌తి చిన్న వేషాన్ని వేస్తూ…. భార్య చెప్పిన‌ట్టుగా స‌క్సెస్ వ‌స్తుంద‌ని ఎదురుచూస్తూ ఉన్నాడు.
  • 1969లో రోజులు మారాయి సినిమాతో శోభ‌న్ బాబు జీవితం కూడా మారిపోయింది. తర్వాత మనుషులు మారాలి, బలిపీఠం,చెల్లెలికాపురం,మైనర్ బాబు,డాక్టర్ బాబు,మానవుడు దానవుడు లాంటి సినిమాలతో మంచి హీరోగా గుర్తింపు పొంది. సినీ ఇండ‌స్ట్రీలో హిట్ న‌టుడిగా త‌న పేరును సుస్థిరం చేసుకున్నాడు.

Advertisement

సినిమాల‌ను ప‌క్క‌కు పెడితే….

  • శోభ‌న్ బాబు జీవితాన్ని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. తన సంపాధ‌నలో అధికభాగం వ్యవసాయభూమి, ఇండ్లస్థలాలను కొన‌డానికి వెచ్చించాడు . ఆ రోజు శోభన్ బాబు చెన్నై చుట్టుప్రక్కల కొన్న‌ ఆస్థుల ప్ర‌స్తుత విలువ దాదాపు ₹20వేల కోట్లకు పైనే!
  • ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే షూటింగ్ ..తర్వాతి స‌మ‌యం పూర్తిగా కుటుంబానికి ఇది శోభ‌న్ ఫిలాస‌ఫీ! మన వృత్తి మన కుటుంబానికి ఆటంకం కాకూడదని తోటి న‌టుల‌కు కూడా చేప్పేవారు.
  • హీరోయిన్స్ సైతం తమ వ్యక్తిగత, కుటుంబ,ఆర్థిక విషయాలన్నింటినీ శోభ‌న్ బాబుతో చర్చించేవారట..ఆయన ఓపికగా సలహాలు ఇచ్చేవారట.
  • శోభన్ బాబు నాస్థికవాది.. మథర్ థెరిస్సా ను ఆరాధించేవారు, ఆయన అనాథ పిల్లలకోసం శాంతి శరణాలయాన్ని, జీవితంలో దగాబడ్డ స్త్రీలకోసం ప్రశాంతి నిలయాన్ని కట్టించారు. మథర్ థెరిస్సా గారిని ఓపెనింగ్ కు పిలవగా ఆమె రాక‌పోవ‌డంతో ఆమె నిలువెత్తు పటాన్ని పెట్టి శాంతినిలయాన్ని ప్రారంభించారు.
  • గుప్త‌దానం చేయ‌డంలో శోభ‌న్ బాబు ముందుంటారు. తన దగ్గర పనిచేసే వారందరికీ ఇళ్ళు కట్టించారట… వారి పిల్లలందరి చదువుల‌ ఖర్చులూ కూడా భరించేవారట.
  • శోభన్ బాబు తనకు చదువు చెప్పిన గురువులందరినీ తన ఇంటికి ఆహ్వానించి వారిని ఘనంగా స‌న్మానించి, వారికి విలువైన కానుకలు,బహుమతులు ఇచ్చార‌ట‌!

Also Read: ఇండియాలో మ్యాచ్ జ‌రిగితే రెండు సీట్లు ల‌తా మంగేష్క‌ర్ కోసమేన‌ట‌.. ఎందుకో తెలుసా..?

రచయిత -రవీంద్ర 

Visitors Are Also Reading