Home » నగ్మా చేసిన పనికి కోపంతో శోభన్ బాబు..నీ ఆస్తి విలువ నా బాత్రూమ్ ఖరీదు అంత ఉండదంటూ..!

నగ్మా చేసిన పనికి కోపంతో శోభన్ బాబు..నీ ఆస్తి విలువ నా బాత్రూమ్ ఖరీదు అంత ఉండదంటూ..!

by Sravya
Published: Last Updated on
Ad

సోగ్గాడు శోభన్ బాబు గురించి తెలియని వారు ఉండరు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో శోభన్ బాబు కూడా ఒకరు. శోభన్ బాబు ఎన్నో చిత్రాలు నటించి అందరినీ ఆకట్టుకున్నారు. పైగా క్రమశిక్షణ కి మారుపేరు శోభన్ బాబు. ఆయన లైఫ్ ని చూస్తే శోభన్ బాబు ఎంత క్రమశిక్షణగా ఉన్నారు అనేది మనకి తెలుస్తుంది. పైగా ఎంతో మందికి గొప్ప సలహాలని కూడా ఇచ్చారు. డబ్బులు ని ఏ విధంగా పొదుపు చేయాలి? ఎలా పెట్టుబడి పెట్టాలి? వంటి సూచనల్ని ఇచ్చేవారు శోభన్ బాబు. చాలామంది నటులు అప్పట్లో శోభన్ బాబు చెప్పినట్లు వింటే ఈ రోజు మంచి ఉన్నత స్థాయికి వెళ్లే వాళ్ళమని.. కోట్లకి అధిపతి అయ్యే వాళ్ళమని అంటూ ఉంటారు.

Advertisement

భవిష్యత్తు అంతా కూడా రీయల్ ఎస్టేట్ మీదే ఉంటుందని శోభన్ బాబు అప్పట్లోనే అర్థం చేసుకున్నారు నటుడిగా సంపాదించిన ప్రతి రూపాయి కూడా భూముల మీద మాత్రమే ఇన్వెస్ట్ చేసేవారు శోభన్ బాబు. శోభన్ బాబు ఏ విధంగా క్రమశిక్షణతో ఉండేవారో అందరిని అదే విధంగా ఉండమని చెప్పేవారు. నగ్మా కి శోభన్ బాబు కి మధ్య ఈ విషయం మీదే గొడవ జరిగింది. మరి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

స్టార్ హీరోయిన్ గా టాప్ హీరోలతో నాగమా సినిమాలు చేస్తున్న రోజులవి. నగ్మా శోభన్ బాబు కలిసి నటిస్తున్నారు. అడవి దొర సినిమా అది. ఒక డ్యూయెట్ ని షూట్ చేస్తున్నప్పుడు చైనా బోర్డర్లో ఒక బ్యూటిఫుల్ లోకేషన్ కి వెళ్లారు. షార్ట్ రెడీ చేసి అందరూ రెడీగా ఉన్నారు. నగ్మా మాత్రం ఇంకా సెట్ కి రాలేదు. అరగంటసేపు చూసినా కూడా నగ్మా ఇంకా సెట్ కి రాలేదు శోభన్ బాబు ఎంతో సహనంగా ఎదురు చూశారు.

గంటన్నర తర్వాత నగ్మా నెమ్మదిగా సెట్ మీదకి వచ్చింది. ఎందుకు లేటుగా వచ్చారని శోభన్ బాబు ఆమెని అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. ఇక శోభన్ బాబు కి కోపం వచ్చింది. నగ్మాను దగ్గరికి పిలిచి నీ ఆస్తి విలువ ఎంత ఉంటుంది అని అడిగారు. నగ్మా చెప్పింది. నా ఇంటి బాత్రూం ఖర్చుతో సమానం అది అని శోభన్ బాబు అన్నారు. అదేవిధంగా ఆర్టిస్ట్ కి క్రమశిక్షణ చాలా ముఖ్యమని గట్టిగా ఆమెకి చెప్పారు. ఆ తర్వాత శోభన్ బాబు గురించి వేరే వాళ్ళని అడిగి తెలుసుకుని నగ్మా షాక్ అయిపోయారు.

Also read:

సంఖ్యా శాస్త్రం ప్రకారం రామ్ చరణ్ కూతురి జాతకం ఎలా ఉండనుంది..? మంచిదేనా..?

Shubman Gill : SRH కెప్టెన్‌ గా శుభ్‌మన్‌ గిల్‌ ?

రామ్ చరణ్ కూతురి ఫోటోలు లీక్.. ఎవరి పోలికలు అంటే..?

Visitors Are Also Reading