Home » కొడుకు అరెస్ట్ గురించి మొదటి సారి మాట్లాడిన షారుక్ ఖాన్..!

కొడుకు అరెస్ట్ గురించి మొదటి సారి మాట్లాడిన షారుక్ ఖాన్..!

by Sravya
Ad

షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖన్నా గత సంవత్సరం గాంధీ జయంతి రోజున మాదకద్రవ్యాల వినియోగం ఆరోపణపై అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తర్వాత వివాదం కాస్త కోర్టు దాకా వెళ్ళింది. ఆర్యన్ కి క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. దీంతో షారుక్ ఖాన్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అలానే ఫ్యాన్స్ కూడా కాస్త రిలీఫ్ చెందారు. ఇక ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. సినిమాలతో బిజీ అయిపోయారు గత ఏడాది చూసినట్లయితే షారుఖ్ ఖాన్ నటించిన మొత్తం మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలుచాయి.

sharukh khan

Advertisement

ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు తాజాగా వచ్చింది. ఒక ఇంటర్వ్యూలో షారుఖ్ ఖాన్ మొదటిసారి కొడుకు అరెస్ట్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. గత నాలుగు ఐదు ఏళ్ళు నాకు నా కుటుంబ సభ్యులకి ఎన్నో సవాళ్ళకి ని పరిచయం చేశాయి. నా సినిమాలు కూడా చాలా ఫ్లాప్ అయ్యాయి. నా కెరియర్ ఇక ముగిసిపోయింది అని చాలామంది అన్నారు తప్పుడు విశ్లేషణల పట్ల బాధపడలేదు కానీ కొన్నిసార్లు ఇబ్బందిని కలిగించాయి. అయినా నేను బయట పెట్టకుండా సైలెంట్ గా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ సక్సెస్ ని అందుకున్నాను.

Advertisement

మళ్ళీ అందరూ పొగడ్తలు కురిపిస్తున్నారు ప్రతి మనిషి జీవితంలో ఇబ్బందులు వస్తాయి పోతాయి. వాటి నుండి పాటలు నేర్చుకుని ముందుకు సాగాలి మన పని కచ్చితంగా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ వస్తుంది అని షారుక్ ఖాన్ అన్నారు. మరింత బాధ్యతగా ఉండాలని గుర్తు చేసుకుంటూ ఈ అవార్డు ని కుటుంబానికి అంకితం చేస్తున్నానని అన్నారు నా పిల్లలకి బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాను. అది వాళ్ళ జీవితంలో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇలా షారుఖ్ ఖాన్ తన కొడుకు గురించి ఇన్ డైరెక్ట్ గా కామెంట్స్ చేశారని తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading