Home » దీప్తి సూనైనా బర్త్ డే..ఆ ఫోటో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పిన షణ్ముక్…కానీ..!

దీప్తి సూనైనా బర్త్ డే..ఆ ఫోటో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పిన షణ్ముక్…కానీ..!

by AJAY
Ad

సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించిన దీప్తి సునైనా షణ్ముక్ నాలుగేళ్లపాటు ప్రేమలో కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్గా ఈ ఇద్దరు తమ లవ్ కు బ్రేకప్ చెప్పుకున్నారు. దాంతో ఇద్దరి అభిమానులు ఎంతో నిరాశ చెందారు. తమ ఫేవరెట్ కపుల్ విడిపోయారని బాధపడ్డారు. ఇక విడిపోయిన తర్వాత షణ్ముక్ మళ్ళీ తన షూటింగ్ లలో బిజీ అయిపోయాడు. మరోవైపు దీప్తి సునైనా సోషల్ మీడియా లో ఎమోషనల్ పోస్ట్ లు షేర్ చేస్తూనే నా వెనకాల నా తండ్రి ఉన్నాడు అంటూ తనకు తాను ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

Deepti sunaina shanmuk

ఇక ఈ జంట విడిపోవడానికి షణ్ముక్ బిగ్ బాస్ హౌస్ లో సిరితో క్లోజ్ గా ఉండటమే కారణం అన్న వాదన కూడా వినిపిస్తోంది. దీప్తి… బిగ్ బాస్ హౌస్ లో సిరి షణ్ముక్ ల ముద్దులు, హగ్గులు చూడలేకే బ్రేకప్ చెప్పిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక బ్రేకప్ తర్వాత కూడా దీప్తిని కలుస్తానని షణ్ముక్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. కానీ ఆ ఛాన్స్ కూడా దీప్తి ఇవ్వనట్టు కనిపిస్తోంది. ఇక ఈ రోజు దీప్తి పుట్టినరోజు జరుపుకుంటోంది.

Advertisement

deepthi sunaina shanmuk breakup

deepthi sunaina shanmuk breakup

ఈ నేపథ్యంలో షణ్ముక్ దీప్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ఆసక్తికరంగా మారింది. తన సోషల్ మీడియా ద్వారా కొన్నేళ్ళ క్రితం దీప్తితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫోటోకు హ్యాపీ బర్త్ డే “డీ” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అయితే దీప్తి మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన షణ్ముక్ కు థాంక్స్ కూడా చెప్పలేదు.

Visitors Are Also Reading