Home » వరల్డ్ కప్ బాధ ఒకటైతే… షమీకి మరో బాధ ఇప్పుడు..!

వరల్డ్ కప్ బాధ ఒకటైతే… షమీకి మరో బాధ ఇప్పుడు..!

by Sravya
Ad

ఇప్పటికే టీమిండియా ప్లేయర్లు విపరీతమైన బాధలో ఉన్నారు వరల్డ్ కప్ గెలవలేదని టీమిండియా ప్లేయర్లు అందరూ కూడా దుఃఖంలో మునిగిపోయారు ఇలాంటి సమయంలో ఈ టోర్నీ టాప్ వికెట్ టేకర్ గా ఉన్న మహమ్మద్ షమీకి ఇంకో షాకింగ్ న్యూస్ వచ్చింది నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా ఓడిపోయింది. సరిగ్గా ఈ మ్యాచ్ జరుగుతున్న టైంలో షమీ తల్లి ఆసుపత్రి పాలయ్యారు ఆమెకి నర్వస్ గా ఉందని జ్వరం వచ్చినట్లు ఉందని షమీ తల్లి చెప్పారు.

Advertisement

సరిగ్గా మ్యాచ్ సమయంలోనే ఇలా జరిగిందట దీంతో అక్కడ ఉన్న బంధువులు వెంటనే ఆమెని దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. షమీ ఫ్యామిలీ యూపీలోని ఉంటోంది. ఇక్కడ ఆసుపత్రిలోనే ప్రాథమిక చికిత్స చేయించారు. తర్వాత మరో పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉంది ఈ ఏడాది వరల్డ్ కప్ లో ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన షమీ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ అందరి ప్రశంసల్ని పొందారు.

Advertisement

భారత్ ఆడిన మొదటి నాలుగు మ్యాచ్లలో షమీ ఆడలేదు ఐదవ మ్యాచ్లో వచ్చారు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్లని తీశారు. అప్పటినుండి కూడా ప్రతి మ్యాచ్ లో కూడా వికెట్లని పడగొడుతూనే ఉన్నారు మొత్తం ఏడు మ్యాచ్లు ఆడిన సూపర్ గా బౌలింగ్ చేస్తూ అదరగొట్టేసారు. ఫైనల్ లో మాత్రం మంచు ప్రభావం ఎక్కువ ఉండటం వలన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading