సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన వేదిక ఖరారు అయ్యింది. హైదరాబాద్ వేదికగానే జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. సీఎంగా ఉంటూనే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్ళబోతున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాతే ఫ్రంట్‌లు, పొత్తుల పై క్లారిటీ ఇవ్వనున్నారు.
Advertisement
నేడు ఖైరతాబాద్ మహాగనపతి శోభాయాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబర్ 4 దగ్గర ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరగనుంది.
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కన్నుమూశారు. అనారోగ్యంతో ఎలిజబెత్ రాణి ప్రాణాలు విడిచారు. సుదీర్ఘకాలం ఎలిజబెత్ బ్రిటన్ ను ఏలారు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీని తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్ చేసింది. హెల్ప్‌లైన్ నెంబర్లను సైతం ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్ : 040-21111111, డీఆర్‌ఎఫ్: 040-295555500 గా ప్రకటించారు.
Advertisement
టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేసాడు. ఇప్పటి వరకు 119 పరుగులతో టాప్ స్కోరర్‌గా రోహిత్ శర్మ ఉండగా… ఆఫ్ఘన్‌పై 122 పరుగులు చేసి రోహిత్‌ను విరాట్ వెనక్కి నెట్టాడు.
ప్రధాని మోడీ నిన్న కర్తవ్యపథ్‌ను ప్రారంభించారు. ఇండియా గేట్ దగ్గర 28 అడుగుల నేతాజీ విగ్రహావిష్కరణ కూడా చేసారు.
బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం మొదలయ్యింది. లడ్డూ వేలం తరవాత గణనాథుడు శోభాయాత్ర ప్రారంభం కానుంది.
సీఎం జగన్ ఈ నెల 22న కుప్పంలో పర్యటించనున్నారు. మున్సిపాలిటీ లో 66 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
తిరుమల లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దాంతో దర్శనానికి 15 గంటల వరకు సమయం పడుతోంది.