ప్రతి ఒక్క విషయాన్ని కూడా పిల్లలు తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఈ పనులు చేసినట్లయితే పిల్లల్లో ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ఓడిపోవడం ఎప్పుడూ ముగింపు కాదని పిల్లలకు తల్లిదండ్రులు నేర్పాలి. ఓటమి నుండి అనుభవాలు నేర్చుకుని విజయాన్ని సాధించే వరకు ప్రయత్నం చేయమని మీరు మీ పిల్లల్ని ప్రోత్సహించాలి ఏ పని మొదలుపెట్టిన దాని పూర్తి చేసే వరకు వదలకూడదని పిల్లలకు చెప్పాలి. పిల్లల్లో సంకల్పబలం అప్పుడే పెరుగుతుంది.
Advertisement
Advertisement
అలానే విజయాన్ని సాధించాలంటే శ్రద్ధ ఏకాగ్రత చాలా ముఖ్యం. ఏ పని చేసినా పూర్తి మనసు పెట్టి చేయాలి. ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రయత్నం చేయడం గెలిచిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని మీరు మీ పిల్లలకి నేర్పాలి. సెల్ఫ్ కేర్ గురించి కూడా మీ పిల్లలకి చెప్పాలి. ఇతరుల్ని గౌరవించడం కూడా నేర్పించాలి. కృతజ్ఞత, క్షమాపణ అలానే రిక్వెస్ట్ చేయడం వంటివి పిల్లలకి నేర్పించాలి. ఇవి లేకపోతే పిల్లల్లో ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నా కూడా పొగరు కింద అందరూ లెక్కపెడతారు. సో ఈ విషయాలన్నీ కచ్చితంగా మీరు మీ పిల్లలకి నేర్పించాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!