ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇవాళ్టి వరకు ఐపీఎల్ మ్యాచ్ లన్నియూ చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. అయితే, తాజాగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ యువ క్రికెటర్ గిల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కోసం కాకుండా టీం కోసం ఆడాలని ఘాటు వాక్యాలు చేశాడు. సెహ్వాగ్ కోపానికి కారణం ఐపీఎల్ 2023లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గిల్ స్లో బ్యాటింగ్.
read also : Balagam Movie : “బలగం” సినిమాకు ఫస్ట్ అనుకున్న 15 టైటిల్స్ ఇవే
Advertisement
యువ క్రికెటర్ గా భారత క్రికెట్ లో తన మార్పును చూపిస్తున్న గిల్…ఇప్పటికే యంగ్ స్టర్ ప్లేయర్ గా ఎదిగిన విషయం తెలిసిందే. అయితే గురువారం మ్యాచ్ లో గిల్ హఫ్ సెంచరీతో సత్తా చాటినప్పటికీ కాస్త నిదానంగా బ్యాటింగ్ చేశాడు. ఈ విషయమే సెహ్వాగ్ కు కోపం తెప్పించింది. పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ కు మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్ గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్ తో 67 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించారు.
Advertisement
read also : Vishnu priya : దేవుడా.. ముద్దుల కోసం బరితెగించిన విష్ణు ప్రియ !
అయితే 22 బంతుల్లోనే 35 పరుగులు చేసిన గిల్, హాఫ్ సెంచరీ చేసేందుకు 18 బంతులు తీసుకున్నాడు. గిల్ ఇలా హాఫ్ సెంచరీ కోసం మిడిల్ ఓవర్స్ లో నిదానంగా ఆడినందుకే సులువుగా గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ కష్టపడి గెలిచిందంటూ పేర్కొన్నాడు. గిల్ వేగంగా ఆడి ఉంటే గుజరాత్ కు అంత ఒత్తిడికి కావాల్సిన అవసరం ఉండేది కాదని అన్నారు. ఇలా నే ఆటను కొనసాగిస్తే ఏదో ఒక రోజు క్రికెట్ గిల్ చెంప చెల్లుమనిపిస్తుందని అన్నాడు.
read also : Shaakuntalam : “శాకుంతలం” ఫ్లాప్ టాక్ రావడానికి ఈ మైనస్ లే కారణమా..?