Home » కలలో మీకు మీరే కనపడితే మంచిదేనా..? స్వప్న శాస్త్రం ఏం చెప్తోంది..?

కలలో మీకు మీరే కనపడితే మంచిదేనా..? స్వప్న శాస్త్రం ఏం చెప్తోంది..?

by Sravya
Ad

సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా కలలు వస్తూ ఉంటాయి కలలు సహజంగా మనకి ప్రతిరోజు వస్తూ ఉంటాయి కానీ కొంతమంది కలలు వచ్చినట్లయితే పెద్దగా పట్టించుకోరు. నిజానికి స్వప్న శాస్త్రం మన కలలని బట్టి మంచిదా కాదా అనేవి చెప్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఏడుస్తున్నట్లు కనపడితే చాలా మంచిది. మీ ఏడుపుని మీరే చూడడం చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుందని స్వప్న శాస్త్రం చెప్తోంది. నిజానికి కలలు భవిష్యత్తుకి అద్దము. కలలో భవిష్యత్తులో మనకి శుభం లేదా అశుభాలు జరగబోతున్నాయి అనేవి చెప్తాయి. కలలో మీరు సంతోషంగా లేదంటే నవ్వుతూ కనపడుతున్నట్లయితే రానున్న కాలంలో కొన్ని శుభవార్తలు వింటారని దానికి అర్థం.

Advertisement

జీవితం లో ఆనందం కలుగుతుంది సిరిసంపదలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మీరు ఏడుస్తున్నట్లు కనపడితే కూడా చాలా మంచిది. మీ ఏడుపుని మీరే చూడడం చాలా మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. కలలో మిమ్మల్ని మీరు ఏడుస్తున్నట్లు చూసుకున్నట్లయితే జీవితంలో పెద్ద విజయాన్ని మీరు అందుకుంటారు. విలాసవంతమైన జీవితాన్ని మీరు గడపబోతున్నారని అర్థం. కలలో కన్నీళ్ళతో ఏడవడం ని ఎవరికి వారు చూసుకున్నట్లయితే జీవితంలో కష్టాలు తగ్గిపోతాయి. రాబోయే రోజుల్లో శుభవార్తలు కూడా వింటారు.

Advertisement

dreams

అలానే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో మీరు చనిపోవడం లేదా చనిపోతున్నట్లు చూడడం వంటివి జరుగుతట్లయితే భవిష్యత్తులో సుదీర్ఘ జీవితాన్ని గడపబోతున్నారని దానికి అర్థం. మీ మృతదేహం స్మశాన వాటికలో ఉన్నట్లు కానీ మృతదేహం ఊరేగిస్తున్నట్లు కానీ మీరు చూసినట్లయితే విజయాన్ని అందుకోబోతున్నారని దానికి సంకేతం. ఇటువంటివి అదృష్టాన్ని కలిగిస్తాయి. అలానే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎగురుతున్నట్లు కనపడితే ఒత్తిడికి లోనవుతున్నట్లు అర్ధం. నిజజీవితంలో ఆందోళన ఎదుర్కోవాల్సి వస్తుందట కలలో పైనుండి పడిపోతున్నట్లు కనపడితే అది అశుభం. మీ కలలో మీరు మేడ మీద నుండి పడిపోవడం వంటివి చూస్తే జీవితంలో సమస్యలు ఎదురవుతున్నాయని దానికి అర్థం.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading