సరిగ్గా పది రోజుల్లో మహాశివరాత్రి రాబోతోంది. ఫిబ్రవరి 18వ తేదీన దేశవ్యాప్తంగా శివరాత్రి పండుగ జరుపుకుంటున్నారు. అయితే ఈ శివరాత్రి పర్వదినానికి ముందు ఇవి మీ కలలో కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో.. ఇప్పుడు తెలుసుకుందాం.. మానసిక నిపుణుల ప్రకారం మీ భవిష్యత్తులో రాబోయే కొన్ని సంఘటనలు మనకు ముందే కలలో వస్తుంటాయి. ఇది ఒక హెచ్చరిక లాగా పని చేస్తాయట. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అని చెబుతున్నారు. ఒక్కోసారి ఈ కలలు శుభసంకేతాలు అవుతాయని పండితులు అంటున్నారు…
అభిషేకం:
మహాశివరాత్రికి ముందు శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టు మీ కలలో వస్తే వారికి శివ అనుగ్రహం కలగబోతోందని, త్వరలో కష్టాలని తొలిగిపోబోతున్నాయని అర్థం. అంతేకాకుండా శివరాత్రికి ముందు బీల్వా ఆకులు వంటివి కలలో కనిపిస్తే మీరు త్వరలో ఆర్థిక కష్టాల నుంచి దూరమవుతున్నారని అర్థం.
నల్లని శివలింగం:
Advertisement
నల్లని శివలింగం శివుని యొక్క చిహ్నం. మహాశివరాత్రికి ముందు మీ కలలో నల్లని శివలింగం కనిపిస్తే మీ పనిలో ప్రమోషన్ పొందుతున్నారని అర్థం.
Advertisement
రుద్రాక్ష:
మహాశివరాత్రికి ముందు మీ కలలో రుద్రాక్ష కనిపిస్తే చాలా మంచిది. ఈ విధంగా రుద్రాక్ష కనిపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా జీవిస్తారని అర్థం.
పాము:
మహాశివరాత్రికి ముందు మీ కలలో పాము కాని పాము పుట్ట కాని కనిపించినట్లయితే అది మీకు సంపదకు ప్రతీకగా చెప్పుకోవచ్చు.
త్రిశూలం:
శివుడు ఎప్పుడు కూడా త్రిశూలం పట్టుకొని ఉంటాడు. దీనికి మూడు అంచులు ఉంటాయి. ఒకటి కా**, రెండవది కోపం, మూడవది దురాశ లను సూచిస్తుంది. సృష్టి సామరస్యాన్ని కొనసాగించడానికి శివుడు త్రిశ్యులాన్ని ఉపయోగిస్తాడు. శివరాత్రికి ముందు ఇవి కలలో కనిపిస్తే త్వరలో మీ కష్టాలని దూరమవుతున్నాయని అర్థం.
also read: