Home » నా కోట్ల సంపాదనకు కారణం సావిత్రి..లలిత జ్యువెలర్స్ ఎండి..?

నా కోట్ల సంపాదనకు కారణం సావిత్రి..లలిత జ్యువెలర్స్ ఎండి..?

by Sravanthi
Published: Last Updated on
Ad

లలిత జ్యువెలరీ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఈ ఒక్క డైలాగ్ మాత్రమే.. డబ్బులు ఊరికే రావు.. ఈ డైలాగుతో ఆ జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్ చాలా ఫేమస్ అయిపోయారు. ఆయన బ్రాండ్ కు తానే అంబాసిడర్ గా వ్యవహరించి లలిత జ్యువెలరీ ఆభరణాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. వ్యాపారవేత్తగా ఎంతో సక్సెస్ అయి కోట్లాది ఆస్తులకు అధిపతి అయ్యారు. అలాంటి కిరణ్ కుమార్ అలనాటి నటి సావిత్రి గురించి పలు విషయాలను పంచుకున్నారు. తాను ఇంత సక్సెస్ కావడానికి కారణం మహానటి సావిత్రి అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం..

Advertisement

 

also read:IPL 2023 కి ముందు RCB బిగ్ షాక్ !

చెన్నైలో మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడే వ్యాపారాన్ని విస్తరించుకున్నారట. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ నాకు సావిత్రి ఇంటితో మంచి బాండింగ్ ఉందని, చాలా ఇష్టంతో సావిత్రి ఆస్తిని కొన్నానని కిరణ్ కుమార్ అన్నారు. అయితే సావిత్రి పిల్లలు ఆమె పేరు మీద ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని, దాన్ని రెంటుకు తీసుకొని బంగారం షాప్ మొదలు పెట్టానని తెలియజేశారు. సావిత్రి ఆశీర్వాదం వల్లే నా వ్యాపారం బాగా నడిచిందని ఇంత పెద్ద సక్సెస్ అయ్యానని పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఆమె పేరు మీదే బిల్డింగ్ ఉందని తెలియజేశారు. అది కేవలం లలిత కార్పొరేట్ ఆఫీస్ అని మాత్రమే రాశాము కానీ సావిత్రి గణేష్ గారి పేరు మీదే ఉంచామని అన్నారు.

Advertisement

అయితే ఒక ఇంటర్వ్యూలో సావిత్రి కూతురు మాట్లాడుతూ అమ్మ ఆస్తి నుంచి వచ్చిన ఇల్లు అదేనని దాన్ని పడగొట్టి కమర్షియల్ బిల్డింగ్ కట్టామని, తర్వాత ఆ బిల్డింగును ఆయనే కొన్నారన్నారు. అయితే ఆ బిల్డింగును కిరణ్ కుమార్ అమ్మడానికి ఒక కారణం ఉందని తెలిపారు. అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్ ది బంగారం షాపె. అమ్మకు కార్లు అంటే ఇష్టం. కిరణ్ కు కూడా చాలా ఇష్టం. ఈ విధంగా అభిప్రాయాలు కలవడమే కాకుండా, ఈ బిల్డింగ్ ఆయన కొనుగోలు చేసిన తర్వాత ఎంట్రెన్స్ లో ఉన్న అమ్మ బొమ్మను తీసుకెళ్తుంటే దాన్ని అక్కడే ఉంచాలని, నేను కొన్నంత మాత్రాన ఆస్తి మీది కాకుండా పోదని ఆయన అన్నారని విజయచాముండేశ్వరి తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading