Home » “సావిత్రి” డ్యాన్స్ చేస్తే “అంజలీదేవి” గుంజిళ్ళు ఎందుకు తీసింది..?

“సావిత్రి” డ్యాన్స్ చేస్తే “అంజలీదేవి” గుంజిళ్ళు ఎందుకు తీసింది..?

by Sravanthi
Ad

మద్రాసులోని తెలుగు సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యాలయం అది. 1973 సెప్టెంబర్ 9 సెకండ్ ఆదివారం కావడంతో ఆ రోజు షూటింగ్ లు అన్నీ బంద్. దీంతో ఆర్టిస్టులంతా ఆ రోజు సరదాగా గడపాలని ప్లాన్ చేసుకున్నారు. అసోసియేషన్ కు గుమ్మడి ప్రెసిడెంట్. నాగభూషణం సెక్రెటరీ. ఇక ఈ తరుణంలో వీరంతా కలిసి ఆరోజు ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు.. మరి వారు ఏం చేశారు? ఎలా చేశారు? అనేది మనం ఇప్పుడు చూద్దాం.. అప్పట్లో ఆర్టిస్టులది ఉరుకుల పరుగుల జీవితం.. ఉదయం 7 గంటలకే షూటింగులు మొదలయ్యేవి.. ఉదయం 7 నుంచి 1గంటల వరకు ఒక సెషన్.. మళ్లీ రెండు గంటల నుంచి రాత్రి వరకు రెండవ సెషన్ షూటింగ్స్ ఉండేవి.. నటీనటులు టైమంటే టైం కు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే దర్శక నిర్మాతల నుంచి చివాట్లు.. ఇలా చాలా మంది ఆర్టిస్టులు దర్శకనిర్మాతలకు భయపడుతూ క్రమశిక్షణతో మెదిలే వారు.

also read:Sr..ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ మూవీ..కథలో ఉన్న ఆ ఒక్క ట్విస్ట్ వల్లేనా..!!

Advertisement

Advertisement

వారికి రెస్ట్ అనేది ఉండేది కాదు.. నిద్ర ఉండదు, సమయానికి ఆహారం ఉండదు. ఉదయం లేచిన నుంచి హడావిడి మొదలు ఇక ఎప్పుడు ఇంటికి వెళ్తారో వారికే తెలియదు.. అలాంటి వారికి ఆ రోజు షూటింగులకు సెలవు కావడంతో ఎంజాయ్ చేద్దాం అని భావించారు.. దీంతో శివాజీ గణేషన్ తన శివాజీ గార్డెన్స్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నటీనటులంతా అక్కడికి చేరుకొని సరదాగా గడుపుతున్నారు. కబడ్డీ ఆటలు ఆడారు. అలా సరదాగా గడుపుతున్న సమయంలో సావిత్రి నా వల్ల కాదు ఆకలి వేస్తోంది అని చెప్పింది. దీంతో అందరూ కలిసి భోజనానికి వెళ్లారు..ఈరోజు మాత్రం డైట్ ఆలోచించకండి శుభ్రంగా తినండి అంటూ ఉన్నారు నాగభూషణం. అలా ఒకరి పై ఒకరు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ భోజనాలు చేశారు.

ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్లీ వారి ఆటలు మొదలు పెట్టారు. పాసింగ్ ది బేబీ అనే ఆట ఆడారు. ఈ ఆటలో చిట్టీలు తీసి అందులో ఎవరికి ఏమి వస్తే ఆ ప్రకారం చేయాలి. దీంతో అంజలీదేవికి గుంజీలు తీయడం. సావిత్రి డ్యాన్స్ చేయడం, పద్మనాభం పిల్లిమొగ్గలు వేయడం, వాణిశ్రీ మూడవ ఎక్కం తలకిందులుగా చెప్పడం, కృష్ణంరాజు చెట్టు ఎక్కడం, గుమ్మడి పసిపిల్లల్ల నటించడం, జయంతి కళ్లుమూసుకుని అక్కడ ఉన్న దర్శకుల గురించి చెప్పడం, జూనియర్ భానుమతి రేలంగిని ముద్దాడడం వంటివి చేశారు. ఆ తర్వాత పాటలు కడుపుతో ఆ రోజు మొత్తం పూర్తిస్థాయిలో సరదాగా గడిపారట.

also read:

Visitors Are Also Reading