క్రికెట్ ఆడడానికి ఎన్నో రూల్స్ ఉంటాయి. కచ్చితంగా రూల్స్ ని పాటించాలి. రూల్స్ ని అతిక్రమించడానికి కుదరదు. వన్డే ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజిలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మొదటిసారి టైండ్ అవుట్ అయిన ఆటగాడిగా నిష్క్రమించాడు.
Advertisement
ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఈ విషయంపై తీవ్రంగా చర్చిస్తున్నారు. ఈ రకంగా మ్యాథ్యూస్ కంటే ముందు అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలామందికి ఈ విషయం తెలీదు అయితే వాళ్లు అవుట్ అయింది ఇంటర్నేషనల్ క్రికెట్లో కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో.
మెరీల్ బోన్ క్రికెట్ క్లబ్ నిబంధనల ప్రకారం ఒక బ్యాటర్ అవుట్ అయినా లేదంటే రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగిన తర్వాత క్రీసులోకి వచ్చే బ్యాటర్ రెండు నిమిషాలలో బంతిని ఎదుర్కోవాలి ఒకవేళ అలా జరగలేదంటే ఇన్కమింగ్ బ్యాటర్ ని టైండ్ అవుట్ రూల్ కింద అవుట్ గా ప్రకటిస్తారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో మాథ్యూస్ ఈ రూల్ కారణంగానే నిష్క్రమించడం జరిగింది. ఎక్స్ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో 2007లో ఇలాంటిది ఒకటి చోటు చేసుకుంది.
Advertisement
On January 5, 2007, Indian cricketer Sourav Ganguly nearly made history by being the first player to be declared 'timed out' in international cricket. He took six minutes to reach the batting crease. However, Graeme Smith, the opposing team's captain, chose not to enforce this… pic.twitter.com/JMhhs5Yaa5
— Anjula Hettige (@AnjulaHettige) November 6, 2023
సచిన్ టెండూల్కర్ నాలుగో ఆటగాడిగా ఆడాల్సి ఉంది తర్వాత లైన్లో వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నారు ఆ టైంలో అతను షవర్ తీసుకున్నడంతో గంగోలి రావాల్సి ఉంది సౌరవ్ గంగూలీ ట్రాక్ ప్యాంట్ లో ఉన్నాడు టైం అయిపోయేలోగా మార్చుకుని రావాల్సి ఉంది. ఆరు నిమిషాలలో గంగోలి వచ్చారు. కానీ టైండ్ అవుట్ గా డిక్లేర్ చేయలేదు ఎంపైర్ అక్కడ సిట్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలా గంగూలీ అక్కడ పరిస్థితి వలన టైండ్ అవుట్గా డిక్లేర్ చేయలేదు ఒకవేళ డిక్లేర్ చేసి ఉంటే అతనే ఈ పరిస్థితి వచ్చిన ఫస్ట్ బ్యాట్సమెన్ అయ్యుండేవాడు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!