బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ లీగ్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. వరల్డ్ లో చాలా దేశాలు అనేక టీ20 టోర్నీలు ఉన్న కూడా ఐపీఎల్ కు ఉన్న వ్యాల్యూ, క్రేజ్ మాత్రం వేరు. ఈ రిచ్ లీగ్ లో ఆడడానికి ప్రపంచ ఆటగాళ్లు అందరూ పోటీ పడతారు. అలాంటి లీగ్ మీద కన్ను వేసింది సౌదీ అరేబియా. ఐపీఎల్ లో పార్ట్నర్ అవ్వడానికి సౌదీ యువరాజు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందుకోసం బీసీసీఐకి సౌదీ భారీ ఆఫర్ ఇచ్చిందట.
ఐపిఎల్ లో పెట్టుబడులు పెట్టడానికి ఐదు బిలియన్ డాలర్లు ఇవ్వడానికి సౌదీ యువరాజు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐదు బిలియన్ డాలర్లు అంటే 41 వేల 500కోట్లు. ఇంత భారీస్థాయిలో సౌదీ పెట్టుబడులకు సిద్ధమవడానికి కారణం ఐపిఎల్. ఐపీఎల్ లో 30 బిలియన్ డాలర్లు కలిగిన భారీ హోల్డింగ్ కంపెనీగా చేయాలని సౌదీ ప్లాన్ చేసి ఇండియన్ గవర్నమెంట్ తో పాటు బీసీసీఐ అధికారులతో కూడా చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల ఐపిఎల్ కు వరల్డ్ వైడ్ గా మరింత క్రేజ్ వస్తుందని సౌదీ యువరాజు గత భారత పర్యటనలో సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ బ్రాడ్ కాస్ట్ కోసం అనేక సంస్థలు వేల కోట్లు ఇస్తూ పోటీ పడుతున్నాయి.
Advertisement
Advertisement
సౌదీ అరేబియాకు చెందిన ఆరాంకో, సౌదీ టూరిజం డిపార్ట్మెంట్ ఐపీఎల్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇక 2024 మినీ వేలం డిసెంబర్ లో జరగనుంది. ఆ మినీ వేలాన్ని కూడా సౌదీలో జరపాలని బీసీసీఐ భావిస్తోంది. మరి సౌదీ ఇచ్చిన ఆఫర్ కు బీసీసీఐ ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి. 2023ఐపీఎల్ భారీ స్థాయిలో హిట్ అయింది. బీసీసీఐకి వేలకోట్ల ఆదాయం వచ్చింది. బ్రాడ్ కాస్ట్ వాల్యూ మరింత పెరిగింది. ఇక ఐపీఎల్ లో ఆడడానికి ఇతర దేశాల ప్లేయర్లు ఎదురు చూస్తూ ఉంటారు. ఐపీఎల్ ఆడితే కోట్లు ఆటగాళ్లకు వస్తాయి. దాంతోపాటు వరల్డ్ వైడ్ గా క్రేజ్ కూడా వస్తుంది. అందుకే విదేశీ ప్లేయర్స్ తమ దేశాల సిరీస్ లను పక్కనపెట్టి ఐపీఎల్ ఆడడానికి వస్తూ ఉంటారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.