Home » Sara Tendulkhar : రాం చరణ్ హీరోయిన్ గా సారా..షాక్ లో గిల్ !

Sara Tendulkhar : రాం చరణ్ హీరోయిన్ గా సారా..షాక్ లో గిల్ !

by Bunty
Ad

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో రాంచరణ్ కు చిరంజీవి రేంజ్ లో క్రేజ్ ఉంది. చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగుపెట్టిన రామ్ చరణ్… మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు రామ్ చరణ్. మగధీర సినిమా తర్వాత… అసలు వెనక్కి చూసుకోలేదు రామ్ చరణ్.

Sara Tendulkhar Acting In Ram Charan Movie

Sara Tendulkhar Acting In Ram Charan Movie

ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు రామ్ చరణ్. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇతనికి విపరీతంగా పెరిగింది. అంతేకాకుండా రామ్ చరణ్ సరసన చేయాలని హీరోయిన్లు కూడా ఆత్రుతగా ఉన్నారు. ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. అయితే ఇలాంటి నేపథ్యంలో… హీరో రామ్ చరణ్ సినిమా గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Shubman Gill Received A Get Well Soon Tweet From Alleged GF, Sara Tendulkar After Getting Dengue

Shubman Gill Received A Get Well Soon Tweet From Alleged GF, Sara Tendulkar After Getting Dengue

త్వరలోనే బాలీవుడ్ దర్శకుడు రాజకుమార్ హీరానీ డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇప్పటికే ఈ సినిమా కథ కూడా ఫినిష్ అయిందని సమాచారం. అయితే ఇందులో సచిన్ కూతురు సారా టెండూల్కర్ ను హీరోయిన్ గా బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సచిన్ కూతురును తీసుకురావాలని అనుకుంటున్నారట. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రామ్ చరణ్ సినిమాలో సారా టెండూల్కర్ నటిస్తే మరి గిల్ పరిస్థితి ఏంటని కొందరు అడుగుతున్నారు.

Advertisement

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading