ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏమాత్రం ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. ఈ సారి మహిళల ఐపీఎల్ కూడా ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉండగా, మహిళల ఐపీఎల్(WPL) లో అందమైన జట్టు ఏది అంటే? ఏమాత్రం తడుముకోకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరు చెప్పాలి. విధ్వంసకర ఆటతో పాటు మతి పోగొట్టే అందాలన్నీ ఆతిశయోక్తికాదు.
Advertisement
Advertisement
టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మందన, ఆసీస్ ఆల్ రౌండర్ ఎల్లిస్ పెర్రీ, ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్, ఆసీస్ పేసర్ మెగాన్ షట్, న్యూజిలాండ్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్, టీమిండియా పేసర్ రేణుకా సింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే జట్టు నిండా అందాలే ఉన్నాయి. ఇన్ని అందాలు చాలవన్నట్లు, ఆర్సీబీ తమ కుటుంబంలోకి క్రికెటేతర అందాన్ని కూడా ఆహ్వానించింది. బెంగుళూరు ఫ్రాంచైజీ స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను మెంటార్ గా నియమించుకుంది. జట్టు అందాల పూతోటగా మారడం పట్ల ఆర్సిబి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అందాలన్నీ ఒకే చోట చేరినట్లు ఉందని సంబరపడిపోతున్నారు. అందంతో పాటు తమ ప్లేయర్స్ ఆటలోను మహారాణులు అంటూ మురిసిపోతున్నారు. ఆటతో పాటు అందాలను ఆస్వాదించే వారికి ఆర్సిబి 100% కనువిందు కలిగిస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నారు.
read also : పాపం… జగపతిబాబు ఇక తాత అవ్వలేడు… పెద్ద కూతురు అలా… చిన్న కుమార్తె ఇలా..