Home » Samantha : నాగచైతన్య కోసం శివుడికి సమంత పూజలు !

Samantha : నాగచైతన్య కోసం శివుడికి సమంత పూజలు !

by Bunty
Ad

సమంత, నాగచైతన్య జంటకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వీరిద్దరి జంట ముచ్చటగా ఉంటుంది. వీరిద్దరూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. వివాహ అనంతరం ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ విడిపోవడాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. వీరిద్దరూ కలిస్తే బాగుండని ఇప్పటికీ ప్రేక్షకులు కోరుకుంటారు.


ఈ క్రమంలోనే సమంత మళ్ళీ నాగచైతన్యతో కలవాలనుకుంటుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే…. నవంబర్ 23వ తేదీన నాగ చైతన్య పుట్టినరోజు జరిగింది. పుట్టినరోజు వేడుకని నాగచైతన్య చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. విడాకుల అనంతరం నాగచైతన్య పెద్దగా పార్టీలకు వెళ్లడం లేదు. అంతేకాకుండా బయట ఎక్కడా కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే సమంత… నాగచైతన్య పుట్టినరోజున శివుని గుడిలో ప్రత్యేక పూజలు చేయించిందట.

Advertisement

Advertisement

Has Samantha reunited with her ex-husband

Has Samantha reunited with her ex-husband

చైతన్యకు డైరెక్ట్ గా విషెస్ చెప్పకపోయినా ఓ బహుమతిని కానుకగా పంపించిందట. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరూ విడిపోయినప్పటికీ సమంతకు నాగచైతన్య అంటే ఇప్పటికీ ఇష్టమేనంటూ కామెంట్లు పెడుతున్నారు. అది చూసిన అక్కినేని అభిమానులు వీరిద్దరూ మళ్ళీ కలవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

 

Visitors Are Also Reading