హీరో హీరోయిన్ ల సినిమాల కంటే వారి రియల్ లైఫ్ లో జరిగే విషయాల పైనే జనాలకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. కాబట్టే హీరోహీరోయిన్ ల జీవితాల్లో జరిగిన విషయాల గురించి తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. అందుకు బెస్ట్ ఉదాహరణగా సమంత నాగచైతన్యల విడాకుల నే తీసుకోవచ్చు.
వీరిద్దరూ గత ఏడాది డిసెంబర్ లో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఇది జరిగి మళ్లీ యేడాది కావస్తున్నా కూడా వీరి విడాకుల గురించి తరచూ ఏదో ఓ వార్త నెట్టింట కనిపిస్తూనే ఉంటుంది. సమంత ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ఆమె చేసిన సినిమాల కంటే నాగచైతన్య తో ఎందుకు విడిపోయారు ఎలా విడిపోయారు అనే ప్రశ్నలే ఎదురవుతు ఉంటాయి.
Advertisement
Advertisement
నాగచైతన్య ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ఆయనకు కూడా అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఇక తాజాగా సమంత బాలీవుడ్ పై సమంత దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో నటించిన తరవాత సమంతకు క్రేజీ ఆఫర్ లు వస్తున్నాయి. దాంతో కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో సైతం సమంత బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి సందడి చేసింది.
ఇక ఈ షోలో సమంత పలు ఆసక్తికర విషయాలను వెల్లడింది. చైతూను కరణ్ భర్త అని సంభోదించగా ఎక్స్ హస్బెండ్ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక కరణ్ ఆ తరవాత నాగచైతన్య ను నిన్ను ఓకే గదిలో ఉంచితే ఏం చేస్తావు అంటూ ప్రశ్నించాడు. దానికి సమంత నువ్వు మా ఇద్దరినీ ఒకే గదిలో ఉంచితే ఆ గదిలో పదునైన వస్తువులను ఉంచాల్సి వస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక సమంత చేసిన కామెంట్స్ తో అక్కినేని ఫ్యాన్స్ ఆమె పై మరోసారి ఫైర్ అవుతున్నారు.