టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సమంత ఏమ్మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సమంత అందం అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తరవాత సమంతను అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో జత కట్టింది. ఇక ఎమ్మాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలోనే చైతూ ప్రేమలో పడిపోయిన సమంత కొంత కాలం డేటింగ్ తరవాత చైతూని పెళ్లి చేసుకుంది.
Advertisement
పెళ్లి తరవాత కూడా సమంత గ్యాప్ లేకుండా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. కానీ అనుకోకుండా ఈ జంట గతేడాది విడాకులు తీసుకుని అందర్ని షాక్ కు గురిచేశారు. అయితే విడాకుల తరవాత సమంత ఎక్కువగా స్నేహితులతో టూర్ లకు వెళుతోంది. విమర్శల నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సోషల్ మీడియా లో మాత్రం సమంత అప్పుడూ ఇప్పుడూ ఎప్పూడూ యాక్టివ్ గానే ఉంటుందన్న సంగతి తెలిసిందే.
Advertisement
కాగా తాజాగా సమంత చాలా కాలం తరవాత ఆస్క్ మీ అంటూ అభిమానులతో మచ్చటించింది. ఈ క్వశ్చన్ అవర్ లో సమంతను నెటిజన్లు పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. అయితే ఓ నెటిజన్ మాత్రం…నువ్వు ప్రెగ్నెంటా…లేదంటే నేను చేస్తా అంటూ దారుణంగా మెసేజ్ చేశాడు. దానికి సమంత ముందు రిప్రొడక్షన్ అంటే అర్థం తెలుసుకో అంటూ అతడికి రాడ్ దింపేసింది.
దాంతో సమంత ఫ్యాన్స్ వాడికి బాగా బుద్ది చెప్పావ్ సామ్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే సమంత ఇటీవల పుష్ఫ సినిమాలో ఊ అంటావా అనే ఐటమ్ పాటకు స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మరోవైపు సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారింది.