Home » “సమంత మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా ?” నెటిజెన్ ప్రశ్నకి అద్దిరిపోయే జవాబు

“సమంత మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా ?” నెటిజెన్ ప్రశ్నకి అద్దిరిపోయే జవాబు

by Sravya
Ad

నటి సమంత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సమంత ఇప్పటికే ఎన్నో సినిమాలు నటించి మంచి పేరును తెచ్చుకుంది. సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సింగిల్ గానే ఉంటోంది. సమంత ని చాలామంది ఇప్పటికే పెళ్లి మళ్లీ ఎప్పుడు చేసుకుంటారు అని అడుగుతున్నారు.

samantha

Advertisement

అనేక సార్లు సమంత కి ఈ ప్రశ్న ఎదురవుతూనే వుంది. ఈ మిలియన్ డాలర్ ప్రశ్నకి ఇక చెక్ పెట్టాలని సమంత నిర్ణయం తీసుకుంది అందుకే ఒక అభిమాని అడిగిన ఈ ప్రశ్నకి ఆమె స్పందించారు.

సమంత ఆదివారం ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ అని సెషన్ ని నిర్వహించారు. ఈ సెషన్ లో అభిమాని అడిగిన పెళ్లి ప్రశ్నకి సమంత రిప్లై ఇచ్చారు ఈ సమాధానాన్ని బట్టి ఇక ఆమె పెళ్లి చేసుకోరేమో అని అనుమానం వస్తోంది. మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా అని అభిమాని అడగగా సమంత చాలా వివరంగా సమాధానం చెప్పారు. 2023లు విడాకుల లెక్కల నివేదిక స్క్రీన్ షాట్ ని షేర్ చేశారు. తాజా లెక్కల ప్రకారం చెడ్డ పెట్టుబడి అవుతుంది అని బిజినెస్ లో పెట్టుబడి మాదిరిగా సమాధానం చెప్పారు ఇలా రాసి ఒక స్మైల్ ఇమోజిని కూడా పెట్టారు.

Advertisement

పెళ్లి చేసుకున్న వారిలో మొదటి పెళ్లి విడాకులు తీసుకుంటున్న వారి రేటు సుమారు 50% వరకు ఉంది. రెండవసారి పెళ్లి చేసుకున్న వారిలో విడాకులు తీసుకుంటున్న వాళ్ళ రేటు 67% గా ఉంది. మూడవసారి అయితే 73% గా ఉందని సమంత అభిమాని అడిగిన ప్రశ్నకి స్క్రీన్ షాట్ ని ఈ విధంగా షేర్ చేసారు. సమంత ఈ లెక్కలతో సమాధానం ఇవ్వడం బట్టి ఎన్ని సార్లు పెళ్లి చేసుకున్న విడాకులు ఎక్కువగా అవుతున్నాయని అలాంటప్పుడు రెండో పెళ్లి ఎందుకు అన్నట్లుగా ఈమె సమాధానం చెప్పింది. దీన్ని బట్టి చూస్తే సమంత సింగిల్ గా ఉండిపోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. 2010లో ఏ మాయ చేసావే సినిమా చేసింది అప్పుడు చైతన్య సమంత ప్రేమించుకున్నారు. 2017లో వీళ్ళ పెళ్లి జరిగింది. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా వీళ్ళిద్దరూ నిలిచారు కానీ 2021లో వీళ్ళిద్దరూ విడిపోయారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading