Home » సమంత, నాగ చైతన్య విడిపోకముందు ఎంత సంపాదించారో తెలుసా..?

సమంత, నాగ చైతన్య విడిపోకముందు ఎంత సంపాదించారో తెలుసా..?

by Azhar
Ad

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిసం పెళ్లి చేసుకోవడం.. ఇక అందులో కొందరు విడిపోవడం వంటి విషయాలు అందరికి తెలిసిందే. అయితే టాలీవుడ్ జంట అయిన సమంత, నాగ చైతన్య కూడా ఆ దారిలోకి వస్తారు. వీరిద్దరు చాలా ఏళ్లుగా ప్రేమించుకొని.. పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత వీరు ఎన్ని రోజులు ప్రేమించుకున్నారో.. అన్ని రోజులు కూడా కలిసి ఉండలేక విడిపోయారు. ఇక గత ఏడాదే వీరు విడాకులు తీసుకున్నారు అనే విషయం అందరికి తెలుసు.

Advertisement

అయితే వీరిద్దరూ హీరో, హీరోయిన్ కావడంతో ఇప్పుడు వీరి సంపాదనకు సంబంధించిన వార్త అనేది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. వీరు కల్సి ఉన్నప్పుడు ఎంత సంపాదించారు.. విడిపోయి ఎంత సంపాదించారు అనే ప్రశ్న ఎక్కువగా వస్తుంది. అయితే సమంత బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి.. మెల్లిమెల్లిగా హీరోయిన్ గా ఎదిగింది. దాంతో ఆమె సంపాదన మొదట తక్కువ ఉన్న తర్వాత బాగా పెరిగింది.

Advertisement

ఇక నాగ చైతన్య సినిమా ఫ్యామిలీ నుండే వచ్చాడు. కాబట్టి అతనికి ముందే ఎన్నో ఆస్తులు అనేవి ఉన్నాయి. కానీ నాగ చైతన్య సొంతగా సినిమాల్లో నటించి 40 కోట్ల వరకు సంపాదించాడు అని తెలుస్తుంది. కానీ సమంత మాత్రం అందుకు రెండింతలు 80 కోట్లు కూడబెట్టింది అని సమాచారం. కానీ వీరు విడాకులు తీసుకున్నాక.. సమంతకు అవకాశాలు ఎక్కువగా రాకపోవడం.. చైతన్య సినిమాలు ప్లాప్ కావడంతో ఇద్దరి సంపాదన ఇప్పుడు తగ్గినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

తనపై వస్తున్న పుకార్ల మీద జడేజా స్పందన..!

పాండ్య కెప్టెన్ అవ్వాల్సిందే..!

Visitors Are Also Reading