అప్పుడప్పుడు ఇండస్ట్రీలో చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి ఫేక్ వార్తలు కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఉన్న నటులు లేదంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ మీద ఏదో ఒక రూమర్ మనకు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటుంది. సమంత అంటే ఒక మంచి నటి తో పాటుగా కాంట్రవర్సీలు విమర్శలు ట్రోల్స్ ఇవన్నీ కూడా మనకి గుర్తొస్తుంటాయి. ఈమె జీవితం సినిమాని మించిపోయిన ఉంది.
Advertisement
హ్యాపీ మూమెంట్స్ తో పాటుగా అనేక సంగతులు కూడా సమంత లైఫ్ లో చాలా ఉన్నాయి గత కొంతకాలం కాబట్టి అన్నిటికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా సమంత ఉంటోంది. అయితే వివాదాలను ఆమె వదిలేసిన ఆమె వివాదాలు మాత్రం వదలట్లేదు తాజాగా ఆమె ప్రమేయం లేకుండా ఓ వివాదంలోకి ఆమె వచ్చింది తెలంగాణ జాతీయ గీతానికి కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం మీద వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర గీతానికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను కీరవానికి అప్పగించడం చారిత్రక తప్పిదం అని తెలంగాణ సినిమా మ్యూజిషియన్స్ అసోసియేషన్ చెప్పింది. ఎంత మాత్రం సరైనది కాదని తెలంగాణ ఆస్తిత్వానికి భంగం కలిగిస్తుందని విమర్శించింది. కవి, రచయిత అందే శ్రీ రచించిన జయహో జయహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం సంతోషించే విషయమైనా ఇతర రాష్ట్రాల కళాకారుల గళానికి అప్పగించడం సరైనది కాదని అంది.
Advertisement
Also read:
జయ జయహే తెలంగాణ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి స్వర కల్పన చేయడానికి నాటు నాటు పాట కాదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. నాటి ఆంధ్రా పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుట ఎగురవేసిన వందలాది మంది అమరుల త్యాగం అని నాలుగు కోట్ల మంది ప్రజల కలల ప్రతిరూపమని ఎక్స్ వైదికగా పోస్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర గీతం పై ఆంధ్ర సంగీత దర్శకుడు పెత్తనం ఏంటని ప్రశ్నించారు. అయితే వేరే రాష్ట్రానికి చెందిన సమంతను ఎందుకు హ్యాండ్లూమ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు చెప్పాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!