సమంత బ్రేక్ తీసుకోవడంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఆమెకు ఉన్న మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తి కోలుకోవాలంటే కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది అని డాక్టర్లు సలహా ఇవ్వడంతో సమంత ఈ నిర్ణయం తీసుకుందని అందరు భావిస్తున్నారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న ఖుషి మూవీ షూటింగ్ నిన్నటితో పూర్తి అయిన విషయం తెలిసిందే. అలాగే సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న హిందీ సిరీస్ సిటాడెల్ తరువాత సమంత షెడ్యూల్ గురించి ఆసక్తిగా అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నట్లు సమంత ప్రకటించింది.
Advertisement
సమంత గతకొంతకాలంగా మాయోసైటిస్ వ్యాధి తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోకుండానే ఆమె సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నారు. దీనితో ఆమె అనారోగ్యం మరింత ఇబ్బందిపెడుతోంది. ఈ క్రమంలో కొంత కాలం బ్రేక్ తీసుకోవాలని సమంత నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఇటీవల చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Advertisement
క్యారవాన్ లైఫ్ గురించి ఆమె నెట్టింట్లో పోస్ట్ చేసారు. ఇంకా ఈ లైఫ్ మూడు రోజులే అని ఆమె పోస్ట్ చేసారు. ఆరు నెలలు కష్టంగా గడిచాయి. ఇక దీనికి ముగింపు పలకాల్సిన టైం వచ్చింది అని ఆమె పోస్ట్ చేయడంతో.. ఖుషి షూటింగ్ లో ఆమె ఇంత కష్టంగా పాల్గొన్నారా అని నెటిజన్స్ ఫీల్ అవుతున్నారు. సిటాడెల్ చిత్రీకరణ కూడా పూర్తి కావొచ్చింది. సమంత నటించిన ఖుషి చిత్రం కూడా సెప్టెంబర్ ఒకటిన విడుదల కాబోతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
మరిన్ని ముఖ్య వార్తలు:
Yawning : అదేపనిగా ఆవలింతలు రావడం అనారోగ్యానికి సంకేతమా..! నిపుణులు ఏమంటున్నారంటే..?
షారుఖ్ సినిమాలో సౌత్ స్టార్ హీరో.. జవాన్ ట్రైలర్‌తో సస్పెన్స్..!
సింహాద్రి మూవీ హీరోయిన్ అంకిత ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా ?