Home » సమంత హెల్త్ అప్డేట్.. పాపం రోజుకూ 4 గంటలు అలానే !

సమంత హెల్త్ అప్డేట్.. పాపం రోజుకూ 4 గంటలు అలానే !

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల సమంత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తగ్గేదేలేదంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది సమంత. శాకుంతలం, ఖుషి చిత్రాలలో నటిస్తోంది. ఇందుకోసం జిమ్ లో తీవ్రంగా కసరత్తులు ప్రారంభించింది.

Advertisement

తాజాగా జిమ్ లో సమంత చెమటోడ్చుతున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. దీనితో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మయోసైటిస్ కు సంబంధించి నెలవారీ ఐవిఐజి సెషన్ కు హాజరైనట్లు తెలిపింది. దీనికోసం రోజు రెండు నుంచి నాలుగు గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చికిత్సలు సమంత ఇంట్లోనే తీసుకుంటుంది.

Advertisement

శరీరంలో బలహీన పడిన ఇమ్యూనిటీ సిస్టంలు సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఇతర వ్యాధుల కారణంగా ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఈ థెరపీ సహాయపడుతుంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం ఈనెల 17న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14 కు వాయిదా వేసుకున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. దీంతో పాటు విజయ్ దేవరకొండ తో కలిసి సమంత ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

Visitors Are Also Reading