టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత… ఈ సినిమాతో బంపర్ విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా మారిపోయింది సమంత. ఇప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉంది సమంత.
2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ సమంత. అయితే వీరు నాలుగు సంవత్సరాలు కాపురం చేసి… విడాకులు తీసుకున్నారు. కారణాలు ఏమి చెప్పకుండానే నాగచైతన్య మరియు సమంత విడిపోయారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమంత… పిల్లల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుందట.
Advertisement
Advertisement
ఇప్పటివరకు PRATHYUSHA CHARITABLE TRUST (ప్రత్యూష ఛారిటబుల్ ట్రస్ట్) అనే స్వచ్ఛంద సంస్థ ను ఏర్పాటు చేసి ఎంతోమంది పిల్లలకు సహాయం చేస్తోంది సమంత. గత 11 సంవత్సరాలుగా ఈ సంస్థ ద్వారా అనేక మంది పిల్లలకు ఆర్థికంగా సహాయం చేసింది. అనారోగ్యo బారిన పడ్డ పిల్లలకు కూడా సహాయం చేసింది సమంత. అయితే ఇప్పుడు తానే స్వయంగా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోవాలని సమంత నిర్ణయం తీసుకుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా చేయనుంది సమంత.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!