అక్కినేని నాగచైతన్య-సమంత ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త అతి తొందరలోనే ప్రేమగా మారింది. దీంతో వారిద్దరూ ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే వివాహమైన కొన్ని రోజులకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీరి విడాకులకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. ఇక విడాకుల అనంతరం వీరిద్దరూ సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నారు.
Advertisement
విడాకులు అనంతరం నాగచైతన్య సినిమాలలో పెద్దగా రాణించినప్పటికీ సమంత మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం సమంత ఖుషి సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ పాత వీడియోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా చేసిన ఓ షోకి సమంత గెస్ట్ గా వెళ్లారు. ఆ షోలో సమంతకు సంబంధించిన విషయాలతో పాటు నాగచైతన్య విషయాలను కూడా అడిగాడు రానా. ఈ షోలో రానా అడిగిన ప్రశ్నలకు సమంత చాలా ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే రానా… సమంత నీకు కుక్కలు అంటే చాలా ఇష్టం అనుకుంటా అని అడగగా…దానికి సమాధానంగా అవును నాకు కుక్కలు అంటే చాలా చాలా ఇష్టం.
Advertisement
ఎన్ని కుక్కలు అయినా నేను పెంచుకుంటాను. కానీ చైతూకి మాత్రం కుక్కలు అంటే ఇష్టం లేదు. ఆయన దృష్టిలో నేను కూడా ఓ కుక్కని. చైతు బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన వెంటనే నేను ఓ కుక్కలాగా అతని వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి మాట్లాడుతాను. చైతు నన్ను అస్సలు పట్టించుకోడు. ఇంట్లో నాది కూడా ఓ కుక్కలాంటి పరిస్థితి అని సమంత ఫన్నీగా చెప్పుకొచ్చింది. ఇక ఈ పాత వీడియోని లో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అక్కినేని ఇంట్లో సమంతకి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి తాను విడాకులు తీసుకుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి
- Sneha : భర్తకు తెలియకుండా ఆ నిర్మాతతో స్నేహ రిలేషన్ !!
- Anushka : అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?
- Kalyaan Dhev : శ్రీజ ఫ్రెండ్‌నే రెండో పెళ్లి చేసుకున్న కళ్యాణ్ దేవ్..?