టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తెలుగుతో పాటూ తమిళ హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో సమంత బాలీవుడ్ లో సైతం క్రేజ్ ను సంపాదించుకున్నారు. దాంతో బాలీవుడ్ ఆఫర్ లను సైతం సమంత అందుకున్నారు. అంతే కాకుండా సమంత కేవలం గ్లామర్ రోల్స్ కు పరిమితం కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా సమంత యశోద అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సరోగసి కాన్సెప్ట్ నేపథ్యంలో ఈ సినిమా తెరెక్కింది.
Advertisement
ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం ఖుషి అనే ప్రేమ కథ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. సమంత అనారోగ్యంతో బాధపడుతుండడం వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఈ క్రమంలో సమంత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అంతేకాకుండా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు కోపం వచ్చినప్పుడు జిమ్ కి వెళ్లి ఇష్టానుసారంగా వ్యాయామం చేస్తానని తెలిపింది.
Advertisement
అప్పుడు వెంటనే కోపం తగ్గిపోతుందని చెప్పింది. డబ్బు, పేరు ప్రఖ్యాతల కోసం తాను ఆరాటపడనని…. తనకు డబ్బు ముఖ్యం కాదని నటన మాత్రమే ముఖ్యమని సమంత వ్యాఖ్యానించింది. అంతేకాకుండా తను చేసే ప్రతి పాత్రను ఆశీర్వదిస్తానని… నటించకపోతే అందులో ఎలాంటి సంతోషం ప్రయోజనం ఉండదని తెలిపింది. తనకు తానే పెద్ద విమర్శకురాలినని వెల్లడించింది.
తప్పులను పొరపాట్లను తెలుసుకోగలిగితేనే ఈ వృత్తిలో ఎదుగుతామని చెప్పింది. అంతేకాకుండా కాలం కలిసి రాకపోతే ఏదీ జరగదని.. అలాంటి సమయంలో చింతించకుండా ఆలోచనలను పక్కనపెట్టి నిద్రపోతానని తెలిపింది. అంతేకాకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండు…. నువ్వు భూమి మీదకి వచ్చింది ఎవరి అభినందనల కోసమో ఇతరులను సంతోష పెట్టడానికో కాదని… మనకు ఉన్నదాంట్లో సంతోష పడటానికి అలవాటు పడితే అవసరమైనవన్నీ వెతుక్కుంటూ వస్తాయని సూచించింది.
ALSO READ :వచ్చే ఎన్నికల్లో పోటీ.. ఎన్టీఆర్ ప్రచారానికి.. తారకరత్న సంచలనం!