Home » ఆ స‌మ‌యంలో రోజుకు ఒక్క‌సారే తినేదాన్ని..స‌మంత ఎమోష‌న‌ల్..1

ఆ స‌మ‌యంలో రోజుకు ఒక్క‌సారే తినేదాన్ని..స‌మంత ఎమోష‌న‌ల్..1

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. సమంత ఇప్పటికే శాకుంతలం, యశోద అనే రెండు సినిమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలు త్వ‌ర‌లోనే విడుదల కానున్నాయి. ఇక‌ తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం తన భర్త నాగచైతన్య తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి సమంత వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక విడాకుల తర్వాత మొత్తంగా సమంత కెరీర్ పైనే దృష్టి పెట్టింది. రీసెంట్ గా పుష్ప సినిమాలో ఊ అంటావా మామా అనే పాటకు స్టెప్పులు వేసి యూత్ మతి పోగొట్టింది.

ALSO READ : నాగార్జున అంటే నాకు అస‌హ్యం..సీపీఐ నారాయ‌ణ సంచ‌ల‌నం..!

Advertisement

Advertisement

Samantha nagachaitanya

Samantha nagachaitanya

ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత చేసిన డ్యాన్స్ కు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమాల్లోకి రాకముందు తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. తాను కాలేజీ టాపర్ ను అని అయితే తన తల్లిదండ్రులకు ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల ఉన్నత చదువులు చదవలేక పోయానని సమంత తెలిపింది. అందులో భాగంగానే యాక్టింగ్ ను కెరీర్ గా ఎంచుకున్నట్లు తెలిపింది.

ఇక కెరీర్ ప్రారంభంలో అనేక పనులు చేశారని ఆ సమయంలో అసలు తినడానికి తిండి కూడా ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. రోజుకు ఒక్కసారి మాత్రమే తినేదానిన‌ని సమంత ఎమోషనల్ అయింది. ఎవరైనా అమ్మాయిలు తమ కలలను సాకారం చేసుకోవాలని అనుకుంటే వాటిని విరమించుకోకూడ‌దని సూచించింది. లక్ష్యసాధన దిశగా ముందుకు అడుగులు వేయాలని అమ్మాయిలకు సమంత సలహా ఇచ్చింది.

Visitors Are Also Reading