2021లో ఎవరూ ఊహించని విధంగా అనేక సంఘటనలు జరిగాయి. ఇందులో చైతూ-సామ్ విడాకులు ఒకటి. 2014 నుంచి ప్రేమించుకున్న ఈ జంట 2017లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. టాలీవుడ్‌లో బెస్ట్ కపుల్‌గా పేరుతెచ్చుకున్న ఈ లవ్లీ కపుల్స్ నాలుగేళ్ల బంధం హ్యాపీగా గడిచింది. అయితే, అనుకోని విధంగా, ఎవరూ ఊహించని విధంగా ఈ జంట విడిపోయింది.
ఇద్దరూ విడిపోతున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించి షాక్ ఇచ్చారు. అక్టోబర్ 2 వ తేదీన విడిపోతున్నట్టు ప్రకటంచారు. దీంతో యావత్ సినీపరిశ్రమ షాక్ అయింది. చైతూ లవ్‌స్టోరీ సినిమాకు ముందు విడాకులు తీసుకుంటారని టాక్ నడిచింది. అయితే, వీరు విడాకులు తీసుకోవడానికి ముందు ఫ్యామిలీతో ప్రైవేట్‌గా మీట్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఫ్యామిలీ మెన్ 2 లో సమంత నటించిన బోల్డ్ సీన్ల గురించి పెద్ద డిస్కషన్ నడిచిందట. ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు ఉందని, అక్కినేని ఇంటి కోడలు ఇలాంటి అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించడం అభ్యంతరకరమని భవిష్యత్తులో ఇలాంటి సన్నివేశాల్లో నటించకూడదని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారట. ఇక సూపర్ డీలక్స్ సినిమా టైమ్‌లో నాగ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారని ఇన్‌సైడ్ టాక్. తనకి పేరు తెచ్చిపెట్టే ప్రాజెక్టుల్లో నటించడంలో తప్పేందని ప్రశ్నించిందన సామ్. దీంతో చైతూకి, సామ్ కి మధ్య గొడవలు మొదలయ్యాలయాని, విడిపోవాలని నిర్ణయించుకున్నారని వార్తలు వార్తలు వచ్చాయి. దగ్గుబాటి ఫ్యామిలీ రంగంలోకి దిగినా లాభం లేకపోయిందట.
Advertisement