Home » ఓటీటీ లోకి వచ్చేస్తున్న సైంధవ్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

ఓటీటీ లోకి వచ్చేస్తున్న సైంధవ్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే..!

by Sravya
Ad

వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమా ఓటీటీ లోకి రావడానికి రెడీ అయిపోయింది. టాలీవుడ్ సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా సైంధవ్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. విక్టరీ వెంకటేష్ సైంధవ్ తర్వాత ఊర మాస్ లుక్ లో అలరించారు. సైంధవ్ మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. సినిమా ట్రైలర్ టీజర్ తోనే ఈ మూవీ మీద ఆసక్తిని కలిగించారు.

Advertisement

Saindhav

ఈ మూవీలోని పాటలకి కూడా రెస్పాన్స్ బాగా వచ్చింది కంటెంట్ బలంగా ఉన్నా కూడా సంక్రాంతి బరిలో ఏకంగా నాలుగు సినిమాలు పోటీ పడడంతో అనుకున్నంత కలెక్షన్లు రాబట్ట లేకపోయింది. ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా క్లిక్ అయ్యాయి ఈ సినిమా రిలీజ్ అయిన నెల రోజులు కాకుండానే ఓటీటీ లోకి వచ్చేస్తోంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి మూడు నుండి స్ట్రీమింగ్ అవ్వబోతోంది అంటే ఫిబ్రవరి 2 అర్ధరాత్రి నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading