సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల కల ప్రపంచం.. ఈ కళా ప్రపంచంలో నటుల కలలు సాకారం కావాలంటే కళతో పాటుగా టాలెంట్,అదృష్టం కూడా ఉండాలి అంటారు. హీరోయిన్ అంటేనే గ్లామర్ అనేది ఎంతో ముఖ్యం.. అలాంటి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తన టాలెంట్ కే పదును పెట్టిన నటి హీరోయిన్ సాయి పల్లవి. టాలీవుడ్ లేడి పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తన సహజమైన నటనతో, డాన్స్ తో చాలా మంది అభిమానులను సొంతం చేసుకుంది.
Advertisement
Advertisement
సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే నెమలి నాట్యం చేస్తున్నట్టు ఉంటుందని చాలా మంది ప్రశంసిస్తారు. ఆమె మొదటి తెలుగు మూవీ ఫిదా తో మొదలు ఇటీవల వచ్చిన శ్యామ్ సింగరాయి వరకు ఏ సినిమా చూసినా తన డాన్స్ తో మెస్మరైజ్ చేస్తూనే వస్తోంది.. కానీ ఆమె నటన వెనుక ఎంతో బాధ కృషి ఉందని సాయి పల్లవి ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.. తన సాంగ్స్ షూటింగ్ సమయంలో తన పెరియడ్స్ చాలా ఇబ్బంది పెట్టాయని, ఆ టైంలో డాన్స్ చేయడం అనేది చెప్పుకోలేని బాధ అంటూ సాయిపల్లవి పేర్కొంది.
ఈ సమయంలో రెండు నుంచి మూడు రోజుల నుంచి ఒకేసారి విశ్రాంతి తీసుకోవలసి వస్తుందని తెలియజేసింది.. ఆ విధంగానే అలసిపోయి ఇంటికి వెళ్లిన తర్వాత తన తండ్రి ఆమె పాదాలకు మసాజ్ చేసే వాడని తన బాధను వెలిబుచ్చింది సాయి పల్లవి. ఆ సినీ కెరియర్ లో క్లాసికల్ సాంగ్స్ నుండి మొదలు చాలా పాటలు పీరియడ్స్ టైంలో తీయాల్సి వచ్చిందని వివరించింది సాయి పల్లవి..
ALSO READ: