Home » పేరు మార్చుకొన్న సాయిధరమ్ తేజ్.. కొత్త పేరు ఏంటంటే..?

పేరు మార్చుకొన్న సాయిధరమ్ తేజ్.. కొత్త పేరు ఏంటంటే..?

by Sravya
Ad

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. మెగా హీరోలలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. సాయి ధరమ్ తేజ్ నటించిన సత్య షార్ట్ ఫిలిం స్పెషల్ ప్రీమియర్ షో ని హైదరాబాద్ లో ప్రసాద్ ల్యాబ్ లో మీడియా కి ప్రదర్శించారు. నవీన్ విజయ్ కృష్ణ ఈ షార్ట్ ఫిలిం కి దర్శకత్వం వహించారు. బలగం నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ మూవీ ని నిర్మించారు. సాయి ధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

తను నటించబోతున్న గంజాయి శంకర్ సినిమా పక్కన పెట్టేసారన్నా వార్తలు ని ఖండించారు. అందులో నిజం లేదని అవాస్తవమని అన్నారు. కొన్ని వెబ్సైట్లు నిజాలు తెలుసుకోకుండా వార్తలు రాస్తున్నారని సాయి ధరమ్ తేజ్ అన్నారు. ఆ క్రమం లోనే సినిమా ఆపేసామని వార్తని కొందరు రాశారు. ఆ సినిమా యధావిధిగా కొనసాగుతుందని సాయిధరమ్ తేజ్ చెప్పారు. ఇకనుండి నా పేరు సాయి ధరంతేజ్ కాదు సాయి దుర్గ తేజ్ అని అన్నారు. పేరు మార్చుకుంటున్నట్లు సాయి ధరమ్ తేజ్ చెప్పారు.

Advertisement

నా పేరులో మా అమ్మ దుర్గ పేరు ఉండాలని ఇలా నిర్ణయం తీసుకున్నానని సాయిధరమ్ తేజ్ అన్నారు. నా పేరులో మా నాన్న పేరు ఇంటి పేరుతో ఎలాగూ ఉంటుంది ఇప్పుడు దుర్గ పేరుని పెట్టుకోవాలని ఇలా నిర్ణయించుకున్నాడని సాయిధరమ్ తేజ పేరు మార్పులు గురించి చెప్పారు. అలానే సాయిధరమ్ తేజ్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. రామ్ చరణ్ తో మల్టీ స్టార్ సినిమా నటించాలని కోరిక ఉందని అందుకోసం వేచి చూస్తున్నానని అన్నారు గతంలో నాగబాబు గారితో నటించాను నా మధ్య పవన్ కళ్యాణ్ తో కూడా నటించాను. త్వరలోనే చిరంజీవితో ఆ తర్వాత రామ్ చరణ్తో నటిస్తానని సాయి ధరమ్ తేజ్ అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading