నందమూరి ఫ్యామిలీ లో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. 11 మంది ఎలా చనిపోయారో తెలుసా..? ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడైన ఎన్టీఆర్ గారు జనవరి 18 1996 లో చనిపోయారు. ఇప్పటికే అయినా చనిపోయి 27 ఏళ్లు అవుతున్నా, ఆయనకి ఉన్న ప్రజాధరణ అసలు తగ్గలేదు. ఆయన పట్ల ప్రజలకి ఉన్న అభిమానం అలానే కొనసాగుతోంది. సినిమాల ద్వారా రాజకీయాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యారు ఎన్టీఆర్. అయితే నందమూరి కుటుంబం లో చాలా విషాదాలు ఉన్నాయి. పలు కారణాల వలన నందమూరి కుటుంబానికి చెందిన ప్రముఖులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
Advertisement
ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య చౌదరి రోడ్డు ప్రమాదం లో చనిపోయారు. శంషాబాద్ లో రెండు వేల ఎకరాలు ని ఆయన కొనుగోలు చేశారు ఆ పొలాన్ని చూసి తిరిగి వస్తుంటే రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ అనారోగ్య కారణాల వలన చనిపోయారు. ఎన్టీఆర్ ఇరుగుపొరుగు సినిమా షూటింగ్ అప్పుడు ఇది జరిగింది.
Advertisement
పెద్ద కొడుకు మరణం తో ఎన్టీఆర్ కుమిలిపోయారు. ఆయన మీద ఉన్న ప్రేమతోనే రామకృష్ణ స్టూడియోస్ ని స్థాపించారు. తర్వాత క్యాన్సర్ కారణంగా ఆయన భార్య బసవతారకం చనిపోయారు. అలాంటి బాధ ఎవరూ పడకూడదని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ని స్థాపించారు.
ఎన్టీఆర్ గారి మరణం తెలుగు రాష్ట్రానికే తీవ్ర విషాదం. తర్వాత ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు చనిపోయారు. కళ్యాణ్ చక్రవర్తి, హరి చక్రవర్తి త్రివిక్రమ్ రావు గారి కొడుకులు. హరి చక్రవర్తి రోడ్డు ప్రమాదం లో మరణించడం తో త్రివిక్రమ రావు గారి ఆరోగ్యం పాడయ్యింది. ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
ఎన్టీఆర్ గారి రెండవ కొడుకు జయ కృష్ణ కూతురు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. తారక రామారావు గారి కొడుకు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదం లో చనిపోయారు. తర్వాత తారకరత్న కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!