తాజాగా ఐదవ రోజు సెషన్ లో ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో 7 వికెట్లు తీసి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వరల్డ్ టెస్టు చాంపియన్ గా నిలిస్తే, భారత్ ఫైనల్స్ లో ఓటమిని ఎదుర్కొని రన్నరప్ ట్రోఫీతో నిలిచింది. నాలుగో రోజు ఆటలో పట్టులేనట్లు కనిపించిన ఆస్ట్రేలియా ఐదవ రోజు మాత్రం ఓ రేంజ్ లో విజృంభించేసింది. మరో వైపు, పెద్దగా పోరాడకుండానే ఇండియా చేతులెత్తేసినట్లు అనిపించడం గమనార్హం.
Advertisement
తాజాగా ఈ మ్యాచ్ పై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనదైన శైలిలో స్పందించారు. సాధారణంగా ఎప్పుడు ఎవరిని ఎలాంటి విమర్శలు చేయని సచిన్ టెండూల్కర్ తాజాగా టీం ఇండియాపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ప్లేయింగ్ ఎలెవన్ లో రవిచంద్రన్ అశ్విన్ చేత ఎందుకు ఆడించలేదో అర్ధం కాలేదని అన్నారు. ప్రస్తుతం అశ్విన్ ప్రపంచ టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నారని అతనిని ఆడించాల్సిందని అన్నారు.
Advertisement
అశ్విన్ లాంటి స్పిన్నర్ కు బాల్ ని టర్న్ చేయడానికి టర్నింగ్ వికెట్ల అవసరం ఉండదని, వైవిధ్యమైన బంతులతో వికెట్లను రాబట్టగలరని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా లోనే ఐదుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారన్న విషయాన్నీ మర్చిపోకూడదని అన్నారు. మరోవైపు నెటిజన్స్ కూడా ఈ విషయమై తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఫైనల్స్ లో అశ్విన్ లాంటి ప్లేయర్ ని పక్కన పెట్టడం టీం ఇండియా చేసిన తప్పు అని పేర్కొంటున్నారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
Niharika Konidela : కొణిదెల నిహారిక ప్రెగ్నెన్సీ… షాక్ లో ఫ్యాన్స్?
Venu Swamy : ఆదిపురుష్ సినిమా అట్టర్ ఫ్లాఫ్ ?
లవర్ తో కలిసి భర్తను లేపేయడానికి మాస్టర్ ప్లాన్…కానీ చివరికి ఎలా దొరికిపోయారంటే.?