శబరిమలలో రోజు రోజుకి రద్దీ బాగా పెరుగుతోంది. చాలామంది క్యూలైన్లో నిలబడుతున్నారు. స్వామివారిని దర్శించుకుంటే, సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు వస్తున్నారట. అదే సమయంలో అధికారులు ఆలయ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం వలన భక్తులు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. రోజు లక్ష మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్నారు. ప్రస్తుతం శబరిమల దర్శనానికి 18 నుండి 24 గంటల సమయం పడుతోంది.
Advertisement
Advertisement
క్యూ లైన్ లో నిరీక్షించలేక పలువురు యాత్రికులు దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. పండలంలోని వలయకోయకల్ ఆలయానికి వెళ్లి నెయ్యి అభిషేకం చేసి వెనక్కి వెళ్ళిపోతున్నారట. ఎక్కువగా వీళ్ళలో ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన భక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆవేదనని వ్యక్తం చేశారు.
కేరళ ప్రభుత్వం తో మాట్లాడి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని అక్కడ ప్రభుత్వాన్ని కోరారట. వారం రోజులుగా శబరిమలలో ఇదే పరిస్థితి వుంది. అధికారులు పోలీసులు మధ్య సమన్వయ లోపం వలన ఈ పరిస్థితి వస్తోందని చెప్తున్నారు. భక్తులు నెమ్మదిగా కదలడం 18 మెట్ల దగ్గర పోలీసులు లేకపోవడం కేరళ పోలీసులకి దేవస్థానానికి మధ్య సమన్వయం లేకపోవడం వలన ఇలా జరుగుతోందని భక్తులు మండిపడుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!