Home » 5 నిమిషాలు ఓర్చుకుంటే అయిపోతుంది.. నేహా శెట్టిని బలవంతం చేసిన డైరెక్టర్ ?

5 నిమిషాలు ఓర్చుకుంటే అయిపోతుంది.. నేహా శెట్టిని బలవంతం చేసిన డైరెక్టర్ ?

by Bunty
Ad

స్టార్ హీరోయిన్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2018లో ‘మెహబూబా’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. కానీ పెద్దగా గుర్తింపును సంపాదించుకోలేదు. ఇక సిద్దు జొన్నలగడ్డ సరసన ‘డీజే టిల్లు’ సినిమాతో ఎంతో క్రేజ్ ను సంపాదించుకుంది. అందులో రాధిక పాత్రలో నటించి పేక్షకులకు మరింత చేరువైంది. ఆ సినిమా అనంతరం ఈ భామ చేసిన ‘బెదురులంక 2012’ సినిమా కూడా మంచి హిట్ నీ అందుకుంది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక తాను రీసెంట్ గా నటించిన చిత్రం ‘రూల్స్ రంజన్’ సినిమాలోని సమ్మోహనుడా సాంగ్ ఎంతో వైరల్ అయింది. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో హీరోయిన్ తో గొడవ జరిగిందని అంటున్నాడు డైరెక్టర్ కృష్ణ.

Director reveals differences with Neha Shetty during Sammohanuda Song Shoot

Director reveals differences with Neha Shetty during Sammohanuda Song Shoot

 

తాజాగా ఈ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రూల్స్ రంజన్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. సమ్మోహనుడా పాటలో స్విమ్మింగ్ పూల్ షాట్ ఒక్కటే మిగిలి ఉంది. ఆ నీళ్లలో ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. నేను ఆ షాట్ కి అంతా సిద్ధం చేసుకున్నాను. హీరోయిన్ నేహాని అందులోకి వెళ్లి యాక్ట్ చేయమని చెబితే నేహా వెళ్లి చేస్తుంది కానీ ఏదైనా జరిగితే నీ వల్లే ఇలా జరిగింది అని అంటుంది. అందుకే ఆ షాట్ లో నేహాని యాక్ట్ చేయడం వద్దని చెప్పాను. కానీ నేహా వినకుండా లేదండి నేను ట్రై చేస్తాను అని చెప్పి వెళ్లి నీళ్లలోకి దిగింది. చాలాసేపు నీళ్లలో ఉండటం వల్ల తన మోకాలికి కాస్త గాయం అయింది.

Advertisement

Advertisement

దీంతో నేహా షాట్ త్వరగా తీయండి అని కాస్త గొడవ చేసింది. నేను ఇంకో ఐదు, పది నిమిషాలు ఓర్చుకో అని చెప్పాను. కానీ నేహా నా మాట వినకుండా నీళ్లలోంచి బయటకు వచ్చేసింది. ఇంకాస్తసేపు అందులో ఉంటే ఆ షార్ట్ పూర్తయ్యేది కదా అని నేను కాస్త గొడవపడ్డాను. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాదాపు మూడు నెలల వరకు మేము ఇద్దరం మాట్లాడుకోలేదు. ఇక ఎడిటింగ్ సమయంలో ఆ షాట్ చూసి చాలా బాధపడ్డాను. ఎవరు నేహా లాగా చేయలేరు అని అనుకున్నాను. ఆ తర్వాత నేహాకి ఫోన్ చేసి మాట్లాడాను. నేహా కూడా ఈ షాట్ తర్వాత చాలా ఏడ్చాను అని చెప్పుకొచ్చిందట. ఒక పక్కన నేను పడిన కష్టం, మరో పక్క ఆ షాట్ చాలా అద్భుతంగా వచ్చిందని తెలిసి ఆనందంతో ఏడ్చాను అని చెప్పిందట.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading