పరిచయం :
కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను ప్రారంభించిన లారెన్స్ దర్శకుడిగా కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. అంతే కాకుండా హీరోగా కూడా క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక తాజాగా లారెన్స్ రుద్రుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు కతిరేసన్ దర్శకత్వం వహించాడు. ప్రియా భవాని సినిమాలో లారెన్స్ కు జోడీగా నటించింది. ఇక తెలుగు తమిళ భాషల్లో ఎప్రిల్ 14న విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్నది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం..
Advertisement
కథ కథనం :
సినిమాలో రుద్రుడు లారెన్స్ ఒక సాధారణ ఉద్యోగి. కాగా రుద్రుడు అనన్య ప్రియా భవానిని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడతాడు. ఆ తరవాత ఆమెను తన ప్రేమలో పడేసుకుంటాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవనం కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో కొంతమంది అనన్యను చంపేస్తారు.
Advertisement
దాంతో రుద్రుడి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. తరవాత తన భార్యను చంపినవారి అంతుచూడాలని నిర్నయించుకుంటాడు. అసలు అనన్యను వాళ్లు ఎందుకు చంపారు..? రద్రుడు పగ తీర్చుకున్నాడా..? కథలో ఆ తరవాత ఏం జరిగింది అన్నదే ఈ సినిమా.
విశ్లేషణ :
సినిమా టైటిల్ మరియు లారెన్స్ లుక్ చూసి కొత్తకాన్సెప్ట్ తో లారెన్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడేమోనని అంతా అనుకున్నారు. కానీ రుద్రుడు సింపుల్ కథతో తెరకెక్కిన రొటీన్ సినిమా. ప్రస్తుతం డిఫరెంట్ సినిమాల కోసం ప్రేక్షకులు చూస్తుంటే రుద్రుడు లాంటి రొటిన్ సినిమా వారికి బోర్ కొట్టించడం కామన్. సినిమాలో కొన్ని సీన్ లు నటీనటుల పర్ఫామెన్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. లారెన్స్ రుద్రుడు పాత్రలో జీవించాడు. తన నటనతో మరోసారి మెప్పించాడు. హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే రుద్రుడు టైం ఉంటే ఓటీటీలో చూడాల్సిన సినిమా.
ALSO READ :Shaakuntalam review : శాకుంతలం రివ్యూ.. సమంత ఖాతాలో భారీ డిజాస్టర్ ?